పట్టువదలని విక్రమార్కుడు...

తమిళ-తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న పేరు గౌతమ్ మీనన్. ఇప్పుడీ దర్శకుడ్ని పట్టువదలని విక్రమార్కుడు అని పిలవొచ్చు. ఎందుకంటే… ఎన్నిసార్లు కుదరదని చెప్పినా.. గౌతమ్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా పదేపదే నో అనిపించుకుంటున్నది ఎవరితోనో కాదు.. స్వయంగా హీరో సూర్యతో. అవును.. కొన్నేళ్లుగా గౌతమ్ చెప్పిన ఏ కథకూ సూర్య ఓకే చెప్పడం లేదు. అప్పట్లో ధృవనక్షత్రం అనే సినిమా దాదాపు ఫైనల్ అయి, ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత కూడా […]

Advertisement
Update: 2016-09-26 11:43 GMT

తమిళ-తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న పేరు గౌతమ్ మీనన్. ఇప్పుడీ దర్శకుడ్ని పట్టువదలని విక్రమార్కుడు అని పిలవొచ్చు. ఎందుకంటే… ఎన్నిసార్లు కుదరదని చెప్పినా.. గౌతమ్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా పదేపదే నో అనిపించుకుంటున్నది ఎవరితోనో కాదు.. స్వయంగా హీరో సూర్యతో. అవును.. కొన్నేళ్లుగా గౌతమ్ చెప్పిన ఏ కథకూ సూర్య ఓకే చెప్పడం లేదు. అప్పట్లో ధృవనక్షత్రం అనే సినిమా దాదాపు ఫైనల్ అయి, ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఆ తర్వాత కూడా మరో ప్రాజెక్టు ఇలానే ఆగిపోయింది. ఇప్పుడు సూర్యను మరోసారి కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడట గౌతమ్ మీనన్. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కాక్క కాక్క సినిమాకు సీక్వెల్ తీస్తానంటున్నాడు గౌతమ్. ఆ సినిమాకు కలైపులి థాను నిర్మాత. ఆ నిర్మాతనే మధ్యవర్తిగా మార్చి సూర్య వద్దకు పంపాడట గౌతమ్ మీనన్. త్వరలోనే గౌతమ్ చెప్పబోయే సీక్వెల్ కథను సూర్య వింటాడని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. దానికంటే ముందు తన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సింగం-3ను విడుదల చేయబోతున్నాడు. ఆ తర్వాతే గౌతమ్ సినిమాపై ఓ క్లారిటీకి వస్తాడు. అన్నట్టు ఇదే కాక్క-కాక్క సినిమాను తెలుగులో ఘర్షణ పేరుతో వెంకటేష్ రీమేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News