మారని రాతలు " అప్పుడు జగన్ కేసు, ఇప్పుడు తుని కేసు

తుని ఘటనలో సీఐడీ విచారణ.  అనుమానాస్పద వ్యక్తులను పిలిపించి నాలుగు గోడల మధ్య విచారిస్తున్నారు. నిజానికి వారు చెప్పే విషయాలు దర్యాప్తు సంస్థ బయట పెట్టకూడదు. చార్జిషీట్‌ రూపంలో కోర్టుకు నేరుగా సమర్పించాలి. విచారణ దశలోనే వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా లీకులు ఇవ్వకూడదని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ తుని ఘటనలో మాత్రం అందుకు విరుద్ధంగానే జరుగుతోంది. గతంలో జగన్ ఆస్తుల కేసు విచారణ సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పనిగట్టుకుని రోజూ విచారణలో అది […]

Advertisement
Update: 2016-09-20 04:03 GMT

తుని ఘటనలో సీఐడీ విచారణ. అనుమానాస్పద వ్యక్తులను పిలిపించి నాలుగు గోడల మధ్య విచారిస్తున్నారు. నిజానికి వారు చెప్పే విషయాలు దర్యాప్తు సంస్థ బయట పెట్టకూడదు. చార్జిషీట్‌ రూపంలో కోర్టుకు నేరుగా సమర్పించాలి. విచారణ దశలోనే వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా లీకులు ఇవ్వకూడదని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ తుని ఘటనలో మాత్రం అందుకు విరుద్ధంగానే జరుగుతోంది. గతంలో జగన్ ఆస్తుల కేసు విచారణ సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పనిగట్టుకుని రోజూ విచారణలో అది తేలింది, ఇది తేలింది అనే అచ్చేసేవి. అలా రాయడం అన్యాయమని అందరికీ తెలుసు. కానీ జగన్‌ కేసులో సీబీఐను నడిపించిందే చంద్రబాబు, రామోజీ అన్న విమర్శలు ఉన్నాయి. కాబట్టి రేపు సీబీఐ ఏం చేయబోతోందో కూడా ముందే సదరు పత్రికలు అచ్చేసి పెట్టుకునేవి. ఇప్పుడు తుని ఘటనలోనూ చంద్రబాబు మీడియా అదే పంథాను ఫాలో అవుతోంది.

కాపు నేత, ఒక ఛానల్ ఎండీ అయిన మంచాల సుధాకర్‌ నాయుడిని సోమవారం సీఐడీ పిలిపించి విచారించింది. ఆయన బయటకు రావడమే ఆలస్యం చంద్రబాబును భుజాన వేసుకున్న ఒక పత్రిక, టీవీ ఛానల్‌… సుధాకర్‌నాయుడు చేతులెత్తేశాడు అన్నట్టుగా కథనం రాసేసింది. తనకు ప్రమాదం జరిగితే పరామర్శించేందుకే రానీ వారు.. ఇక కాపులకేం న్యాయం చేస్తారని సీఐడీ వద్ద ఆయన చెప్పారని నేరుగా రాసింది. ”విశ్వసనీయ సమాచారం”, ”తెలిసింది” అన్న పదాలు కూడా వాడలేదు. అంతేకాదు ప్రజలను రెచ్చగొట్టింది ముద్రగడే, డ్రోన్ కెమెరాలు తెచ్చింది ముద్రగడ కుమారుడేనని మొత్తం గుట్టును సుధాకర్ నాయుడు బయటపెట్టారని బాబు పత్రిక వెల్లడించింది. ఆ పత్రిక రాసింది జాగ్రత్తగా గమనిస్తే కాపుల మధ్య ఐక్యత అదృశ్యమైందా అన్న అనుమానం కలుగుతుంది.

ఇక్కడ మరో విషయం ఏమిటంటే సీఐడీ విచారణలో సుధాకర్ నాయుడు అలా చెప్పారన్నది ఒక్క బాబు పత్రికలోనే వచ్చింది. మరే మీడియా సంస్థకు సమాచారం కూడా లేదు. అంటే గతంలో జగన్ ఆస్తుల కేసుతో సీబీఐ తరహాలోనే ఇప్పుడు ఏపీ సీఐడీ కూడా తుని కేసులో చంద్రబాబు పత్రికల మనుషులను పక్కన కూర్చోబెట్టుకుని విచారణ జరుపుతోందా?. లేక సీఐడీ అధికారులే సాయంత్రానికి కథనాన్ని రాసి సదరు పత్రికకు పంపుతున్నారా?. విచారణ జరుగుతున్న సమయంలో వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా మీడియాకు లీకులివ్వకూడదని కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ బాబు మీడియాకు లెక్కలేకుండాపోయాయి. బాబు పత్రికలో వచ్చిన కథనాన్ని చూసి సుధాకర్ నాయుడు న్యాయ పోరాటం చేస్తానంటున్నారు. తాను ఒకటి చెబితే మరొకటి రాశారని ఆరోపించారు. విచారణ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఓ అమాయక సుధాకర్‌నాయుడు… అవి అయ్యే పనులేనా?. న్యాయపోరాటం చేసి బాబుపైనా, ఆయన మీడియాపైనా నెగ్గుతారా?. విచారణ ఫుటేజ్‌ను బయటపెట్టమనగానే పెట్టేస్తారా?. అలా పెట్టాలనుకున్నా వారికి అవసరమైనది మాత్రమే బయటకు వదులుతారు గానీ మీరు డిమాండ్‌ చేస్తే ఆవేశపడేందుకు అక్కడున్నది అమాయకులు కాదు చంద్రబాబు అండ్ కో.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News