హక్కుల సేనాని కన్నుమూత

పౌరహక్కుల నేత, ప్రముఖ రచయిత, న్యాయవాది, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం కన్నుమూశారు. కొన్నేళ్లుగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత రాత్రి హైదారబాద్‌ అశోక్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరుగుతాయి. 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్పలో బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామికి బొజ్జా తారకం జన్మించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై దళిత పక్షాన నిలబడి సుప్రీంకోర్టులో కేసు వేసి […]

Advertisement
Update: 2016-09-16 23:43 GMT

పౌరహక్కుల నేత, ప్రముఖ రచయిత, న్యాయవాది, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం కన్నుమూశారు. కొన్నేళ్లుగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గత రాత్రి హైదారబాద్‌ అశోక్‌నగర్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరుగుతాయి. 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్పలో బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామికి బొజ్జా తారకం జన్మించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై దళిత పక్షాన నిలబడి సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడారు బొజ్జా తారకం. తోట త్రిమూర్తులు దళితులకు శిరోమండనం చేయించిన కేసుకు సంబంధించి ఎమినిది నెలల కిందట వైజాగ్ స్పెషల్ కోర్టుకు బొజ్జా తారకం వెళ్లారు. ఆ సమయంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ్నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చారు. గత కొద్దికాలంగా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.

బొజ్జా తారకం.. అంబేద్కర్‌ రచించిన ”రాముడు కృష్ణుడు రహస్యాలు’ను తెలుగులోకి అనువధించారు. ‘పోలీసులు అరెస్టుచేస్తే‘ కులం-వర్గం’, ‘నేల-నాగలి-మూడెద్దులు’‘పంచతంత్రం’ (నవల)‘నది పుట్టిన గొంతుక’ రచనలను బొజ్జా తారకం చేశారు.

Click on Image to read: English Article

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News