బర్నింగ్ స్టార్ గురువు ఎవరో తెలిసిపోయింది...

పేరుకు తగ్గట్టే బర్నింగ్ స్టార్ అయిపోయాడు. వెండితెరకే వేడిని పరిచయం చేశాడు. అతడే సంపూర్ణేష్ బాబు. ఎవరైనా హీరో అవ్వొచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం మన సంపూ. నిండైన ఫిజిక్ తో, చెదరని చిరునవ్వుతో ఎప్పుడూ ఫన్నీగా కనిపించే సంపూర్ణేష్ బాబు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు… అతడికి ఎందుకు రావాలనిపించింది… ముఖానికి రంగేసుకోవాలనే థాట్ ఎలా వచ్చింది… ఇంతకీ సంపూర్ణేష్ బాబుకు సినీగురువు ఎవరు… ఈ ప్రశ్నలకు సంపూ సింపుల్ గా సమాధానం చెప్పేశాడు. తనకు […]

Advertisement
Update: 2016-09-15 22:53 GMT

పేరుకు తగ్గట్టే బర్నింగ్ స్టార్ అయిపోయాడు. వెండితెరకే వేడిని పరిచయం చేశాడు. అతడే సంపూర్ణేష్ బాబు. ఎవరైనా హీరో అవ్వొచ్చు అనడానికి నిలువెత్తు నిదర్శనం మన సంపూ. నిండైన ఫిజిక్ తో, చెదరని చిరునవ్వుతో ఎప్పుడూ ఫన్నీగా కనిపించే సంపూర్ణేష్ బాబు అసలు సినిమాల్లోకి ఎలా వచ్చాడు… అతడికి ఎందుకు రావాలనిపించింది… ముఖానికి రంగేసుకోవాలనే థాట్ ఎలా వచ్చింది… ఇంతకీ సంపూర్ణేష్ బాబుకు సినీగురువు ఎవరు… ఈ ప్రశ్నలకు సంపూ సింపుల్ గా సమాధానం చెప్పేశాడు. తనకు అన్నీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబే అంటున్నాడు. చిన్నప్పట్నుంచి మోహన్ బాబు సినిమాలు చూసి, పొడుగాటి డైలాగులు చెప్పడం ప్రాక్టీస్ చేసేవాడినని.. అది ఇప్పుడు తనకు బాగా పనికొచ్చిందని అంటున్నాడు సంపూ. అంతేకాదు… మోహన్ బాబు నడక, నిబ్బరం అంటే తనకు చిన్నప్పట్నుంచి ఎంతో ఇష్టం అంటున్నాడు. మోహన్ బాబు బ్యానర్ లో ఓ సినిమాలో హీరోగా నటించడం ఈ జీవితానికే మరిచిపోలేని జ్ఞాపకం అంటున్నాడు సంపూ బాబు. మంచు విష్ణు నిర్మాతగా తెరకెక్కించిన సింగం-123లో సంపూ బాబు హీరోగా నటించిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News