కృష్ణయ్య కూడానా....

నయీంతో నేతల అక్రమసంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా బీసీ నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. నయీంతో కృష్ణయ్యకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణయ్య స్పందించారు. నయీంతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని చెప్పారు. నయీంతో కలిసి తాను దందాలు చేశానని చెప్పడం అబద్దమన్నారు. తనను ముఖ్యమంత్రిగా చూడాలని నయీం కోరుకునేవాడని చెప్పారు. 2014లో తాను సీఎం కాలేకపోయినందుకు నయీం బాధపడ్డారన్నారు. తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని నయీం […]

Advertisement
Update: 2016-09-16 08:26 GMT

నయీంతో నేతల అక్రమసంబంధాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా బీసీ నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేరు తెరపైకి వచ్చింది. నయీంతో కృష్ణయ్యకు సంబంధాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణయ్య స్పందించారు. నయీంతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని చెప్పారు. నయీంతో కలిసి తాను దందాలు చేశానని చెప్పడం అబద్దమన్నారు. తనను ముఖ్యమంత్రిగా చూడాలని నయీం కోరుకునేవాడని చెప్పారు. 2014లో తాను సీఎం కాలేకపోయినందుకు నయీం బాధపడ్డారన్నారు. తనలాంటి బడుగుల నేత సీఎం కావాలని నయీం ఆకాంక్షించారని చెప్పారు. తన వద్దకు రోజుకు బాధల్లో ఉన్నవారు చాలామంది వస్తారని చెప్పారు. అలాగే నయీం బాధితులు కూడా కొందరు తన వద్ద గోడును వెళ్లబోసుకున్నారని, వారి తరపున నయీంకు ఫోన్ చేసి తిట్టానని వెల్లడించారు. నయీం మరో ముగ్గురితో కలిసి లొంగిపోయేందుకు తన సాయం కోరాడని చెప్పారు. అందుకు సాయం చేసేందుకు తాను సరే అన్నట్టు చెప్పారు. నయీం పలుమార్లు ఫోన్ చేసినట్టు చెప్పారు. నయీం చావుకు నెల ముందు ఒకసారి కలిశామని వెల్లడించారు. రాడికల్ యూనియన్‌లో పని చేసినప్పుడు నయీంతో సంబంధాలు ఉండేవన్నారు. తనలాంటి నిజాయితీ పరులను టార్గెట్ చేయడం ప్రభుత్వానికి సరికాదన్నారు.

Click on Image to Read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News