కోర్టులతో బాబు సంబంధాలపై రోశయ్య అలాంటి వ్యాఖ్యలు చేశారా..?

కాంగ్రెస్‌ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ”మనసులో మాట పేరు”తో ఒక ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మేనేజ్‌మెంట్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మేనేజ్మెంట్‌ ద్వారానే ప్రజల మద్దతు లేకపోయినా చంద్రబాబు సీఎం అవగలిగారన్నారు. ఇందుకు ఉదాహరణగా గతంలో తనతో మాజీ గవర్నర్ రోశయ్య చెప్పిన విషయాన్ని రామచంద్రయ్య వివరించారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉండగా ఒక సారి ఏదైనా బై ఎలక్షన్ ద్వారా అసెంబ్లీకి వెళ్లాల్సిందిగా రోశయ్యను తాను కోరానని రామచంద్రయ్య చెప్పారు. […]

Advertisement
Update: 2016-09-11 10:21 GMT

కాంగ్రెస్‌ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత సి. రామచంద్రయ్య ”మనసులో మాట పేరు”తో ఒక ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు మేనేజ్‌మెంట్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మేనేజ్మెంట్‌ ద్వారానే ప్రజల మద్దతు లేకపోయినా చంద్రబాబు సీఎం అవగలిగారన్నారు. ఇందుకు ఉదాహరణగా గతంలో తనతో మాజీ గవర్నర్ రోశయ్య చెప్పిన విషయాన్ని రామచంద్రయ్య వివరించారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉండగా ఒక సారి ఏదైనా బై ఎలక్షన్ ద్వారా అసెంబ్లీకి వెళ్లాల్సిందిగా రోశయ్యను తాను కోరానని రామచంద్రయ్య చెప్పారు.

అందుకు స్పందించిన రోశయ్య.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో బై ఎలక్షన్‌కు వెళ్లి గెలవడమా?.ఆయన సీఎంగా ఉన్న సమయంలో అది అయ్యే పనికాదు, చంద్రబాబు సీఎంగా ఉండగా బైఎలక్షన్‌లో గెలవడం జరగదు… కోర్టుల్లో మనకు( కాంగ్రెస్‌ వాళ్లకు) అనుకూలంగా ఒక తీర్పు రావడమూ ఉండదని రోశయ్య చెప్పారన్నారు. చంద్రబాబు ఆ స్థాయిలో మేనేజ్ చేయగలిగిన వ్యక్తి అని రామచంద్రయ్య చెప్పారు. పుష్కరాలకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తీసుకొచ్చి మర్యాదలు చేసిన చంద్రబాబు.. ఇక్కడ ప్రతిపక్ష నాయకులను మాత్రం పట్టించుకోలేదన్నారు. తాను శాసనమండలిలో ప్రతిపక్ష నేతనైనప్పటికీ ఎస్కార్ట్ వాహనం గానీ, సెక్యూరిటీ గానీ ఇవ్వలేదని చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించాలన్న ఆలోచన కూడా వదులుకున్నానని సి. రామచంద్రయ్య చెప్పారు. చంద్రబాబు ఎవరి మాట వినడం లేదని టీడీపీ నేతలే తనతో స్వయంగా చెప్పి బాధపడ్డారన్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వారికి నేరుగా కండువాలు కప్పడం అనైతికమన్నారు. మోదీ కాళ్లు, పవన్‌ కల్యాణ్ గడ్డం, తప్పుడు హామీలను నమ్ముకుంటే చంద్రబాబుకు ఒక శాతం ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News