అభినేత్రి కూడా దసరా బరిలోనే....

దసరాకు ఇప్పటికే సినిమాలు ఎక్కువైపోయాయి. ఎన్ని ఆ టైమ్ కు థియేటర్లలోకి వస్తాయో తెలీదు కానీ… చాలామంది తమ సినిమా దసరాకే వస్తుందని ప్రకటించేస్తున్నారు. రామ్ నటిస్తున్న హైపర్, నాగచైతన్య నటిస్తున్న ప్రేమమ్, సునీల్ చేసిన వీడు గోల్డ్ ఎహే, కల్యాణ్ రామ్ చేస్తున్న ఇజమ్ సినిమాలు దసరాకే వస్తున్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి అబినేత్రి కూడా చేరింది. తమన్న లీడ్ రోల్ లో నటిస్తున్న అభినేత్రి సినిమాను కూడా దసరాకే విడుదల చేస్తామని […]

Advertisement
Update: 2016-09-09 22:42 GMT

దసరాకు ఇప్పటికే సినిమాలు ఎక్కువైపోయాయి. ఎన్ని ఆ టైమ్ కు థియేటర్లలోకి వస్తాయో తెలీదు కానీ… చాలామంది తమ సినిమా దసరాకే వస్తుందని ప్రకటించేస్తున్నారు. రామ్ నటిస్తున్న హైపర్, నాగచైతన్య నటిస్తున్న ప్రేమమ్, సునీల్ చేసిన వీడు గోల్డ్ ఎహే, కల్యాణ్ రామ్ చేస్తున్న ఇజమ్ సినిమాలు దసరాకే వస్తున్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి అబినేత్రి కూడా చేరింది. తమన్న లీడ్ రోల్ లో నటిస్తున్న అభినేత్రి సినిమాను కూడా దసరాకే విడుదల చేస్తామని ప్రకటిస్తున్నాడు నిర్మాత కోన వెంకట్. ఈనెల 11న సినిమా ఆడియోను విడుదల చేసి, సరిగ్గా దసరా రోజున అంటే అక్టోబర్ 7న అభినేత్రిని థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నాడు. సో… ఈ సినిమాతో కలుపుకొని దసరా బరిలో ఇప్పటివరకు 5 సినిమాలు నిలిచాయి. ఈ 5 సినిమాలకూ ఒకేసారి థియేటర్లు కేటాయించడం అంటే చాలా కష్టమైన పని. కాబట్టి… వీటిలో కచ్చితంగా కనీసం 2 సినిమాలు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఆ రెండు సినిమాలు ఏంటనేది త్వరలోనే తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం… సునీల్, తమన్న సినిమాలు రేసు నుంచి వెనక్కి తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు కల్యాణ్ రామ్ కూడా అనవసరంగా పోటీ ఎందుకనే ఆలోచనలో ఉన్నాడట.

Tags:    
Advertisement

Similar News