సీపీఎం విషయంలో తికమక... తిరుపతికి, కాకినాడకు ఇంత తేడానా?

పవన్‌కల్యాణ్ కాకినాడ మీటింగ్‌లో భవిష్యత్తు పొత్తు విషయాన్నికూడా పరోక్షంగా ప్రస్తావించారు. సీపీఎంతో కలిసి పనిచేస్తామన్నారు. సభకు మద్దతు ఇచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రామకృష్ణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కాదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర విభజనను సీపీఎం వ్యతిరేకించినప్పుడే తాను ఆపార్టీకి దాసోహం అయ్యానన్నారు పవన్. అయితే శనివారం జరగనున్న వైసీపీ, సీపీఎం బంద్‌కు పవన్‌ మద్దతు తెలపకపోవడం ఆసక్తికరంగానే ఉంది. తిరుపతి సభలో హోదా కోసం రోడ్లపైకి వస్తాం, […]

Advertisement
Update: 2016-09-09 07:19 GMT

పవన్‌కల్యాణ్ కాకినాడ మీటింగ్‌లో భవిష్యత్తు పొత్తు విషయాన్నికూడా పరోక్షంగా ప్రస్తావించారు. సీపీఎంతో కలిసి పనిచేస్తామన్నారు. సభకు మద్దతు ఇచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రామకృష్ణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కాదు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి. రాష్ట్ర విభజనను సీపీఎం వ్యతిరేకించినప్పుడే తాను ఆపార్టీకి దాసోహం అయ్యానన్నారు పవన్. అయితే శనివారం జరగనున్న వైసీపీ, సీపీఎం బంద్‌కు పవన్‌ మద్దతు తెలపకపోవడం ఆసక్తికరంగానే ఉంది.

తిరుపతి సభలో హోదా కోసం రోడ్లపైకి వస్తాం, అంతా స్తంభింపచేస్తామంటూ అగ్రెసివ్‌గా మాట్లాడిన పవన్… కాకినాడ సభకు వచ్చే సరికి మాత్రం బంద్‌లు, రాస్తారోకోలు అవసరం లేదనడం ఆశ్చర్యంగానే ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలే పోరాటం చేయాలని పవన్ చెప్పడం ఆసక్తిగానే ఉంది. పైగా పవన్ తన ప్రసంగంలో పదేపదే వెంకయ్యనాయుడిని టార్గెట్ చేశారే గానీ చంద్రబాబును ఒక్కమాట కూడా అనకపోవడం చర్చనీయాంశమే.

కేంద్రం ప్యాకేజ్ ప్రకటించడం దాన్నిచంద్రబాబు స్వాగతించడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ పాచిపోయిన లడ్డూలను తీసుకుంటారో లేదో చంద్రబాబు నిర్ణయించుకోవాలనడం పాచిపోయిన స్టేట్‌మెంట్‌లాగే అనిపిస్తుంది. మొత్తం ఉపన్యాసంలో చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ ఒక్క విషయంలో మాత్రమే ప్రశ్నించారు. అన్ని తీసుకెళ్లి అమరావతిలో పెట్టవద్దని మాత్రం సూచించారు. తిరుపతి సభకు కాకినాడ సభకు పోల్చిచూస్తే పోరాటం విషయంలో పవన్‌ చాలా మెత్తబడిపోయినట్టుగా ఉంది. రోడ్లపైకి వచ్చి స్తంభింపచేస్తామనే స్థాయి నుంచి ఆందోళనలు అవసరం లేదనే పంథాకు పవన్ రావడం విమర్శలకు అవకాశం ఇచ్చేదే.

దేశ సమగ్రత గురించి చెప్పిన పవన్ కల్యాణ్‌… ఉత్తర భారతదేశం వారు దక్షణ భారతీయులను అణచివేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏపీకి వెన్నుపోటు పొడిస్తే… బీజేపీ మాత్రం పొట్టలో పొడిచిందన్నారు. ఓవరాల్‌గా చూస్తే ప్రత్యేక హోదా విషయంలో ఇక పోరాటం చేయడం తమ వల్ల కాదని టీడీపీ, వైసీపీ చేతులెత్తినప్పుడు మాత్రమే పవన్ రంగంలోకి దిగుతారన్న మాట. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా ఒక సమస్యపై పోరాటం చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేసిన సంఘటన లేదు. అలాంటి పరిస్థితి కూడా ఉండదు. మరి పవన్ కల్యాణ్ ఎప్పుడు ఉద్యమం చేసేందుకు వస్తారో!.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News