యువతి పట్ల తెనాలి టీడీపీ నేత కీచకత్వం

గుంటూరు జిల్లా తెనాలి టీడీపీ కౌన్సిలర్ ఒక యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆర్యవైశ్య విద్యానిధి హాస్టల్‌లో పనిచేస్తున్న యువతిని అక్కడి గుమస్త లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ కౌన్సిలర్ పెండ్యాల వెంకట్రావ్ … ఆమెను పిలిపించుకుని సర్ధి చెప్పాడు. పెండ్యాల మాటలపై గౌరవంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచన విరమించుకుంది. అయితే గుమస్తా ఆగడాలు మాత్రం ఆగలేదు. దీంతో […]

Advertisement
Update: 2016-09-06 03:53 GMT

గుంటూరు జిల్లా తెనాలి టీడీపీ కౌన్సిలర్ ఒక యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆర్యవైశ్య విద్యానిధి హాస్టల్‌లో పనిచేస్తున్న యువతిని అక్కడి గుమస్త లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న టీడీపీ కౌన్సిలర్ పెండ్యాల వెంకట్రావ్ … ఆమెను పిలిపించుకుని సర్ధి చెప్పాడు. పెండ్యాల మాటలపై గౌరవంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచన విరమించుకుంది. అయితే గుమస్తా ఆగడాలు మాత్రం ఆగలేదు. దీంతో ఆమె ఈసారి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పెండ్యాల వెంకట్రావ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా మనిషి మీదే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ కీచకుడిగా ప్రవర్తించాడు. చేయి పట్టుకుని లాగి ఎక్కడపడితే అక్కడ శరీరంపై చేయి వేసి చెప్పుకోలేని విధంగా చేశాడని బాధిత యువతి మీడియాతో చెప్పారు. ”నీవు ఒంటరి దానివి. నేను త్వరలోనే చైర్మన్ కూడా అవుతా… నేను నిన్ను ఏం చేసినా అడిగేవారు లేరు” అంటూ బెదిరించాడని యువతి చెబుతోంది. ఎప్పటిలాగే యువతి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు… వెంకట్రావ్ టీడీపీ నేత కావడంతో పిలిపించి మాట్లాడుతామంటున్నారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.

Click on Image to Read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News