ఒక్కటవుతున్నారు...

వైఎస్‌ఆర్‌కు కేవీపీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంధుత్వం లేకపోయినా అంతకంటే ఎక్కువగానే ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలున్నాయి. అయితే వైఎస్‌ మరణం తర్వాత పరిస్థితి తారుమారైంది. అంతర్గతంగా వారి సంబంధాలు ఎలా ఉన్నాయో గానీ, బయటకు మాత్రం ఒకవేదికపై కనిపించిన దాఖలాలు లేవు. తొలినాళ్లలో మినహా జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్‌ వర్థంతి సమయంలోనూ ఆయన ఘాట్‌ వద్దకు కేవీపీ గానీ ఆయన కుటుంబసభ్యులు గానీ రాలేదు. అయితే […]

Advertisement
Update: 2016-09-06 00:19 GMT

వైఎస్‌ఆర్‌కు కేవీపీకి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బంధుత్వం లేకపోయినా అంతకంటే ఎక్కువగానే ఆ రెండు కుటుంబాల మధ్య సంబంధాలున్నాయి. అయితే వైఎస్‌ మరణం తర్వాత పరిస్థితి తారుమారైంది. అంతర్గతంగా వారి సంబంధాలు ఎలా ఉన్నాయో గానీ, బయటకు మాత్రం ఒకవేదికపై కనిపించిన దాఖలాలు లేవు. తొలినాళ్లలో మినహా జగన్ పార్టీ పెట్టిన తర్వాత వైఎస్‌ వర్థంతి సమయంలోనూ ఆయన ఘాట్‌ వద్దకు కేవీపీ గానీ ఆయన కుటుంబసభ్యులు గానీ రాలేదు. అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన వైఎస్ వర్థంతి సందర్భంగా కేవీపీ సతీమణి ఇడుపులపాయకు వచ్చారు. అది కూడా ఒంటరిగా వచ్చి వెళ్లడం కాదు. వైఎస్‌ కుటుంబసభ్యులతో కలిసే సమాధి వద్ద నివాళులర్పించారు. కేవీపీ సతీమణి వైఎస్‌కు నివాళులర్పిస్తున్న దృశ్యాలను సాక్షి మీడియా కూడా బాగానే కవర్ చేసింది. కేవీపీ భార్య ఇడుపులపాయకు రావడం వెనుక రెండు కుటుంబాల మధ్య తిరిగి బంధం బలపడుతున్న దానికి నిదర్శనమంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి వ్యూహాత్మక తప్పిదాలు కూడా కారణమన్న అభిప్రాయం గట్టిగా ఉంది. అదేకాకుండా వైఎస్‌ వెంటనడిచిన సీనియర్ నాయకులు కూడా జగన్‌కు దూరంగా ఉండడం వైసీపీని ఇబ్బంది పెట్టింది. వీటిని గమనించే జగన్‌ కూడా వైఎస్‌కు సన్నిహితులుగా ఉన్న వారికి దగ్గరవతున్నారని చెబుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత కేవీపీ భార్య వైఎస్ కుటుంబసభ్యులతో కలిసి ఇడుపులపాయకు రావడం కూడా అలాంటిదేనంటున్నారు. కొద్ది రోజుల క్రితం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ… జగన్‌ను బహిరంగంగానే సమర్దించారు. జగన్ నా మేనల్లుడండి. అతడి వైపు నిలబడితే తప్పేంటి అని ప్రశ్నించారు. ఒకప్పుడు వైఎస్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఉండవల్లి ఇంటికి కూడా కొద్దిరోజుల క్రితం జగన్‌ నేరుగా వెళ్లారు. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు వైఎస్‌ వెంట నడిచిన సైన్యం…ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌కు కూడా అండగా నిలిచేందుకు సిద్దమైందన్న సంకేతాలు వస్తున్నాయి. కొద్దిరోజుల్లోనే కేవీపీ, జగన్‌ ఒకే వేదిక మీద కనిపించినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలంటున్నాయి.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News