రాజధాని భూములను దున్నుతున్న రైతులు

ఏపీ రాజధాని ప్రాంతంలో భూవివాదాలు పరిష్కారం అవడం లేదు. మల్కాపురంలో కొందరు రైతులు తమ భూములను ట్రాక్టర్లతో దున్నుతున్నారు. గత ఏడాది కౌలు చెక్కులు చెల్లించిన సీఆర్‌డీఏ ఈ ఏడాది మాత్రం చెక్కులు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. కౌలు చెక్‌ల కోసం వెళ్తే అసలు భూములే మీవి కావంటున్నారన్నారు. 1926 నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములు ఇప్పుడు తమవి కాకుండా ఎలాపోతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. వేరే వారు వచ్చి భూములు వారివంటూ సీఆర్‌డీఏ అధికారులకు చెప్పారని […]

Advertisement
Update: 2016-09-06 00:35 GMT

ఏపీ రాజధాని ప్రాంతంలో భూవివాదాలు పరిష్కారం అవడం లేదు. మల్కాపురంలో కొందరు రైతులు తమ భూములను ట్రాక్టర్లతో దున్నుతున్నారు. గత ఏడాది కౌలు చెక్కులు చెల్లించిన సీఆర్‌డీఏ ఈ ఏడాది మాత్రం చెక్కులు ఇవ్వలేదని రైతులు చెబుతున్నారు. కౌలు చెక్‌ల కోసం వెళ్తే అసలు భూములే మీవి కావంటున్నారన్నారు. 1926 నుంచి తమ ఆధీనంలో ఉన్న భూములు ఇప్పుడు తమవి కాకుండా ఎలాపోతాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. వేరే వారు వచ్చి భూములు వారివంటూ సీఆర్‌డీఏ అధికారులకు చెప్పారని అప్పటి నుంచి తమను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతులు చెబుతున్నారు.

1926 నుంచి నాలుగైదుసార్లు రిజిస్ట్రేషన్ అయిన భూములు తమవని, పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు అన్నీ ఉన్నాయని రైతులంటున్నారు. కానీ అవన్నీ అధికారులు పట్టించుకోవడం లేదని, కౌలు చెక్కులు, స్థలాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని రైతులంటున్నారు. కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సిందిగా అధికారులు సూచించారని… రైతులమైన తాము హైకోర్టు చుట్టూ ఎక్కడ తిరగగలమని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి తాము పూర్తిగా మోసపోయామంటున్నారు. రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరిగేందుకే సరిపోతోందన్నారు. అందుకే తమ భూములను తిరిగి సాగు చేసుకునేందుకు సిద్దమయ్యామంటున్నారు. సీఆర్‌డీఏ అధికారులు వచ్చి ఏం చేస్తారో చూస్తామంటున్నారు. మంత్రి నారాయణ చెప్పే మాటలు బాగానే ఉంటున్నాయని కానీ… సీఆర్‌డీఏ మాత్రం పనిచేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News