పవన్‌ ఆ పని చేస్తే దమ్ము ఉన్నట్టే...

రాజకీయాలు చేసే సినిమావాళ్లపై ఒక అపవాదు ఉంది. వారు నాలుగేళ్ల కాలం సినిమాలతో ఎంజాయ్‌ చేసి తీరా ఎన్నికల సమయంలో వచ్చి సినీ గ్లామర్‌ను ఎరగా వేసి జనాన్ని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారన్నది ఆ అపవాదు. చిరుపార్టీ పెట్టడం కూడా అలాంటిదే. తీరా ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీ పెట్టి ఆ ఊపులోనే సీఎం అయిపోదామనుకున్నారు. కానీ ఆయన ఎత్తు పారలేదు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయం అలాంటిదే. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో తీరా పోలింగ్‌కు […]

Advertisement
Update: 2016-09-04 00:06 GMT

రాజకీయాలు చేసే సినిమావాళ్లపై ఒక అపవాదు ఉంది. వారు నాలుగేళ్ల కాలం సినిమాలతో ఎంజాయ్‌ చేసి తీరా ఎన్నికల సమయంలో వచ్చి సినీ గ్లామర్‌ను ఎరగా వేసి జనాన్ని బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారన్నది ఆ అపవాదు. చిరుపార్టీ పెట్టడం కూడా అలాంటిదే. తీరా ఎన్నికలకు ఆరు నెలల ముందు పార్టీ పెట్టి ఆ ఊపులోనే సీఎం అయిపోదామనుకున్నారు. కానీ ఆయన ఎత్తు పారలేదు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయం అలాంటిదే. మొన్నటి సాధారణ ఎన్నికల సమయంలో తీరా పోలింగ్‌కు కొద్దిరోజలు ముందు హడావుడి చేసి ఫలితాలను తారుమారు చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. దీంతో పవన్ కల్యాణ్‌ ఈసారి కూడా నాలుగేళ్లు కాలక్షేపం చేసి తీరా ఎన్నికలకు ఏడాది ముందు హల్ చల్‌ చేస్తారన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని పవన్‌ కల్యాణ్ ప్రకటించారు. అది ఏ స్థాయిలో చేస్తారో ఇంకా క్లారిటీ లేదు.

అయితే ఇంతలోనే విశాఖ, కాకినాడ, తిరుపతి, కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. పవన్‌ నిజంగానే పదవుల కోసం కాకుండా జనం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఉంటే త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలన్నది చాలా మంది భావన. కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన బరిలో దిగితేనే పవన్‌ రాజకీయ చిత్తశుద్దిని ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే మరి కొందరు మాత్రం కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే… వాటిలో ఫలితాలు ఎదురుతిరిగితే ఇక జనసేన కథ సమాప్తమైనట్టేనంటున్నారు. పవన్ అనుచరులు మాత్రం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామని చెబుతున్నారు. పవన్ ఆలోచన కూడా అదేంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పవన్‌ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. పైగా జనసేన సత్తా ఎంత అన్నదానిపై ప్రజలు 2019 వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. కార్పొరేషన్ ఎన్నికలు 2019 ఎన్నికలకు సెమి ఫైనల్‌గా ఉపయోగపడుతాయి. ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News