ఓటుకు నోటు తీర్పు చెప్పిన జడ్జి బంధువా?

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై శుక్రవారం వాడివేడిగా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా కాసింత ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. ఒక ప్రముఖ పత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. చంద్రబాబుపై విచారణ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వగానే ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఏజీపీ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  జడ్జి కూడా కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్లకముందే ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు […]

Advertisement
Update: 2016-09-02 23:08 GMT

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలంటూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై శుక్రవారం వాడివేడిగా హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా కాసింత ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. ఒక ప్రముఖ పత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. చంద్రబాబుపై విచారణ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వగానే ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఏజీపీ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జడ్జి కూడా కోర్టు హాల్ నుంచి బయటకు వెళ్లకముందే ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ఆర్కే తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డితో ”చంద్రబాబుపై విచారణకు ఆదేశించిన ఏసీబీ కోర్టు మేజిస్టేట్ మీ వాడే..ఎవరికి తెలియదు.” అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఒక న్యాయమూర్తికి బంధుత్వాలు అంటగట్టడంపై వెంటనే హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి సుధాకర్‌ రెడ్డి తీసుకెళ్లారు. ఆయన కూడా విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఇవన్నీ కామన్‌ అంటూ న్యాయమూర్తి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారట. కోర్టు నుంచి బయటకువచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ సహాయ న్యాయవాదికి, సుధాకర్‌ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తమవాడు ఎలా అవుతాడో చెప్పాలంటూ ఏజీపీని నిలదీశారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా తీవ్రంగా స్పందించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు, న్యాయవాదులు జోక్యం చేసుకుని సర్ధిచెప్పారు.

చంద్రబాబుపై పిటిషన్ విచారణ సమయంలోనూ వాడీవేడిగా వాదనలు సాగాయి. ఓటుకునోటు కేసులో ఎమ్మెల్యే ఆర్కేకు ఏం సంబంధం అని చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. రాజకీయ ప్రత్యర్థి కాబట్టే ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారని అన్నారు. ఒక దశలో ఓటుకు నోటు కేసులో ఫిర్యాదు చేసే అర్హత ఫిర్యాదుదారుకు ఎక్కడ ఉందని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి స్పందించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి… ఇలాంటి కేసుల్లో ప్రైవేట్ వ్యక్తులు జోక్యం చేసుకునే అర్హత ఉందని… దీనిపై సుప్రీం కోర్టు తీర్పు కూడా ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను కొన్ని ఉదహరించారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి ”అవన్నీ వద్దు మీరు ఒక తీర్పుచూపితే వాళ్లు వంద తీర్పులు చూపిస్తారు” అంటూ వ్యాఖ్యానించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో విచారణపై రెండు నెలలు స్టే విధించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News