విమోచ‌న‌మా... విలీన‌మా?

సెప్టెంబ‌రు 17.. 1948 హైద‌రాబాద్ సంస్థానం భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైన దినం. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం మొద‌లైన త‌రువాత బీజేపీ నేత‌లు ఈ విమోచ‌న నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. నిజాం హ‌యాంలో హైద‌రాబాద్ స్టేట్‌లో ర‌జాకార్లు సాగించిన అరాచ‌కాల‌ను వివ‌రిస్తూ.. కొన్నేళ్లుగా తెలంగాణ విమోచ‌న దినం పేరిట ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకార‌మై రెండేళ్లు దాటింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని బీజేపీ వాదిస్తోంది. దీని వెన‌క బీజేపీ వ్యూహం అంద‌రికీ […]

Advertisement
Update: 2016-08-29 23:22 GMT
సెప్టెంబ‌రు 17.. 1948 హైద‌రాబాద్ సంస్థానం భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైన దినం. మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం మొద‌లైన త‌రువాత బీజేపీ నేత‌లు ఈ విమోచ‌న నినాదాన్ని భుజానికెత్తుకున్నారు. నిజాం హ‌యాంలో హైద‌రాబాద్ స్టేట్‌లో ర‌జాకార్లు సాగించిన అరాచ‌కాల‌ను వివ‌రిస్తూ.. కొన్నేళ్లుగా తెలంగాణ విమోచ‌న దినం పేరిట ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సాకార‌మై రెండేళ్లు దాటింది. కొత్త రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని బీజేపీ వాదిస్తోంది. దీని వెన‌క బీజేపీ వ్యూహం అంద‌రికీ తెలిసిందే! బీజేపీ చెప్పిన‌ట్లుగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తే.. తెలంగాణ‌లోని మైనార్టీల‌ను తెలంగాణ వ్య‌తిరేకులుగా చిత్రీక‌రించిన‌ట్ల‌వుతుంది. అందుకే ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి.. త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబిస్తోంది. త‌మ ప్ర‌భుత్వం ముస్లిం మైనార్టీల‌కు వ్య‌తిరేకం కాద‌న్న సంకేతాల‌ను స్ప‌ష్టంగా చాటిచెబుతోంది. అందుకే సెప్టెంబ‌రు 17న విలీన దినోత్స‌వంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ విష‌యంలో టీఆర్ ఎస్ వ్యూహం ఫ‌లించింది. మొన్న జ‌రిగిన గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ముస్లిం జ‌నాభా అధికంగా ఉన్న పాత‌బ‌స్తీలోనూ గులాబీ జెండా రెప‌రెప‌లాడ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం.
బీజేపీ ఇక్క‌డే మ‌త రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ప‌లువురు సెక్యుల‌రిస్టులు వాదిస్తున్నారు. భార‌త యూనియ‌న్‌లో విలీన‌మైన సంద‌ర్భంగా విలీన దినం నిర్వ‌హిస్తుంటే బీజేపీ మాత్రం మ‌త రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపిస్తున్నారు. స్వాతంత్రానికి పూర్వం ముస్లిం నవాబు కింద ఉన్న‌పుడు మ‌త‌ప‌ర‌మైన ఇబ్బందులు సృష్టించిన మాట వాస్త‌వ‌మే. ఎవ‌రో ర‌జాకార్లు హిందువుల‌పై దాడులు చేస్తే… విమోచన దినం అంటూ ఇప్పుడు వేడుక‌లునిర్వ‌హిస్తే.. అది మైనార్టీల‌ను అనుమానించ‌డం, అవ‌మానించ‌డ‌మే అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు. అందుకే, టీఆర్ ఎస్ త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బీజేపీ మాత్రం విమోచ‌నం అంటూ ప్ర‌తి ఏడూ హ‌డావుడి చేస్తోంది. ఈసారైనా బీజేపీ ఎత్తుగ‌డ ఫ‌లిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News