రేణు దేశాయ్ కు ఇష్టమైన పవన్ ఫొటో...

పవన్ కల్యాణ్ కు సంబంధించి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. పవన్ ఫొటోల్లో తనకు ఇష్టమైన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 2010లో తీసిన ఆ ఫొటోలో పవన్ చాలా సీరియస్ గా ఉన్నాడు. కానీ ఆ కళ్లల్లో తీక్షనత, ఆ ఆలోచన, ఆ స్టయిల్ తనకు ఎంతగానో నచ్చాయని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. అప్పుడే కెనాన్ 5డీ కెమెరా కొన్నానని, ఎలా పనిచేస్తుందో చూద్దామని ఊరికే పవన్ ఫొటో ఒకటి […]

Advertisement
Update: 2016-08-30 02:23 GMT

పవన్ కల్యాణ్ కు సంబంధించి ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టారు. పవన్ ఫొటోల్లో తనకు ఇష్టమైన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 2010లో తీసిన ఆ ఫొటోలో పవన్ చాలా సీరియస్ గా ఉన్నాడు. కానీ ఆ కళ్లల్లో తీక్షనత, ఆ ఆలోచన, ఆ స్టయిల్ తనకు ఎంతగానో నచ్చాయని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. అప్పుడే కెనాన్ 5డీ కెమెరా కొన్నానని, ఎలా పనిచేస్తుందో చూద్దామని ఊరికే పవన్ ఫొటో ఒకటి క్లిక్ మనిపించానని రేణు చెప్పుకొచ్చింది. అలా అనుకోకుండా తీసిన ఫొటో అద్భుతంగా వచ్చిందని… ఆ కళ్లు అంటే తనకు చాలా ఇష్టమని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ ఫొటోలో ఎలాంటి ఎడిటింగ్ లేదని, పవన్ మేనిఛాయ కూడా ఒరిజినల్ అని చెప్పింది రేణుదేశాయ్. ఆమె విడుదల చేసిన ఆ పిక్…. నెట్ లో వైరల్ అయింది. దాదాపు 5-6 గంటల పాటు పవన్ అభిమానులు ఆ ఫొటో గురించే ఆన్ లైన్ లో చర్చించుకున్నారు. త్వరలోనే పవన్ కు సంబంధించి మరిన్ని ప్రత్యేకమైన ఫొటోల్ని విడుదల చేస్తానని ప్రకటించింది రేణుదేశాయ్.

Click to Read….

మ‌హేష్ ను ఎన్టీఆర్ ఓవ‌ర్ టేక్ చేస్తాడా..?

Tags:    
Advertisement

Similar News