ఎస్‌ఆర్ఎం అధినేత అరెస్ట్... బాబుకు ఇలాంటి వారే దొరుకుతారా?

ప్రముఖ విద్యాసంస్థ ఎస్‌ఆర్ఎం అధినేత పచ్చముత్తు అరెస్ట్ అయ్యారు. చెన్నై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పచ్చముత్తుపై చీటింగ్ కేసుతో పాటు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ సీట్ల కోసం డబ్బు కట్టినా తమకు అడ్మిషన్లు ఇవ్వలేదని 100 మందికి పైగా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. మద్రాసు హైకోర్టు ఆదేశంతో పచ్చముత్తు కేసును సీఐడీ విచారిస్తోంది. మరోవైపు ఇటీవలే పచ్చముత్తుకు చెందిన ఎస్‌ఆర్‌ఎంకు అమరావతిలో ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని […]

Advertisement
Update: 2016-08-26 03:40 GMT

ప్రముఖ విద్యాసంస్థ ఎస్‌ఆర్ఎం అధినేత పచ్చముత్తు అరెస్ట్ అయ్యారు. చెన్నై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పచ్చముత్తుపై చీటింగ్ కేసుతో పాటు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ సీట్ల కోసం డబ్బు కట్టినా తమకు అడ్మిషన్లు ఇవ్వలేదని 100 మందికి పైగా విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు.

మద్రాసు హైకోర్టు ఆదేశంతో పచ్చముత్తు కేసును సీఐడీ విచారిస్తోంది. మరోవైపు ఇటీవలే పచ్చముత్తుకు చెందిన ఎస్‌ఆర్‌ఎంకు అమరావతిలో ఏపీ ప్రభుత్వం 200 ఎకరాల భూమిని దారాదత్తం చేసింది. అయితే ఇలాంటి మోసగాడికి, సీట్లు అమ్ముకునే సంస్థకు 200 ఎకరాలు ఇవ్వడంపై వివాదం అవవచ్చు. పచ్చముత్తే కాదు… అమరావతిలో 400 ఎకరాలు తీసుకుంటున్న జగ్గీ వాసుదేవన్‌ కూడా ఇటీవల వివాదంలో చిక్కుకున్నారు. జగ్గీ తన ఆశ్రమంలో తన ఇద్దరు కుమార్తెలను బంధించాడంటూ కొయంబత్తూరులో ఒక లెక్చరర్ పోలీసులను ఆశ్రయించారు. నెట్రస్ ఆక్సైడ్ సాయంతో ఆశ్రమానికి వచ్చిన వారి మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు రెడీ అయిన అజయ్ దేవగన్ కూడా అనంతరం పనామా జాబితాలో బయటపడ్డారు. మొత్తం మీద అమరావతి బ్రాండ్‌ను పెంచేందుకు చంద్రబాబు ఎంపిక చేసుకుంటున్న మనుషులు, సంస్థలన్నీ వివాదాస్పదంగానే ఉన్నాయి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News