అందుకు కారణం వైఎస్సే " హర్షకుమార్

తన వల్లే సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించగలిగిందంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా స్పందించారు. సింధు విజయంలో తన పాత్ర ఉందని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గుగూల్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఎంపికైనప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు హర్షకుమార్. చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. పుల్లెల గోపిచంద్ అకాడమీ తన […]

Advertisement
Update: 2016-08-24 10:07 GMT

తన వల్లే సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించగలిగిందంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రంగా స్పందించారు. సింధు విజయంలో తన పాత్ర ఉందని చంద్రబాబు చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గుగూల్ సీఈవోగా సుందర్ పిచాయ్ ఎంపికైనప్పుడు కూడా చంద్రబాబు ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు హర్షకుమార్. చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. పుల్లెల గోపిచంద్ అకాడమీ తన వల్లే అభివృద్ధి చెందిందని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే “గోపిచంద్ నిమ్మగడ్డ ఫౌండేషన్ బ్యాడ్మింటన్‌ అకాడమీ” అభివృద్ధి చెందిందని చెప్పారు. అకాడమీ అభివృద్ధి ఫీజు రూ. 1.2 కోట్లను రద్దు చేసింది వైఎస్ కాదా అని ప్రశ్నించారు.

పరిపాలనను గాలికొదిలేసి పుష్కరాల పేరుతో సమయాన్ని వృధా చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. కడియం పూలు, ఆస్ట్రేలియా టపాసులంటూ సీఎంగా కాకుండా ఓ ఈవెంట్ మేనేజర్‌లా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ప్రత్యేక హోదా సాధించడం వంటి పనులను గాలికొదిలేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పుష్కరాలతో కాలక్షేపం చేశారని హర్షకుమార్ ఫైర్ అయ్యారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News