జిల్లా కోసం రాజీనామా చేస్తా: డీకే

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌ద్వాల జిల్లాకు తానే అడ్డంకి అయితే త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. పాల‌మూరు జిల్లా అభివృద్ధికాకపోవడానికి డీకే అరుణ‌నే కార‌ణ‌మ‌ని ప‌దే ప‌దే టీఆర్ ఎస్ నాయ‌కులు ఆరోపించ‌డాన్ని ఆమె త‌ప్పు బ‌ట్టారు. గ‌ద్వాల జిల్లా ఏర్పాటుకు నిజంగా తానే అడ్డంకి అని టీఆర్ ఎస్ నేత‌లు భావిస్తున్నట్ల‌యితే త‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వి అక్క‌ర్లేద‌ని, రాజీనామా చేసేందుకు ఇప్ప‌టికిప్పుడు సిద్ధ‌మ‌ని […]

Advertisement
Update: 2016-08-23 23:44 GMT

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌ద్వాల జిల్లాకు తానే అడ్డంకి అయితే త‌న శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేయ‌డానికి తాను సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. పాల‌మూరు జిల్లా అభివృద్ధికాకపోవడానికి డీకే అరుణ‌నే కార‌ణ‌మ‌ని ప‌దే ప‌దే టీఆర్ ఎస్ నాయ‌కులు ఆరోపించ‌డాన్ని ఆమె త‌ప్పు బ‌ట్టారు. గ‌ద్వాల జిల్లా ఏర్పాటుకు నిజంగా తానే అడ్డంకి అని టీఆర్ ఎస్ నేత‌లు భావిస్తున్నట్ల‌యితే త‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వి అక్క‌ర్లేద‌ని, రాజీనామా చేసేందుకు ఇప్ప‌టికిప్పుడు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. గ‌ద్వాలను జిల్లాగా చేయాల‌న్న‌ది ఈ ప్రాంత‌పు వాసుల చిర‌కాల వాంఛ అని ఆమె తెలిపారు. తెలంగాణ ఉద్య‌మంలో ముఖ్యంగా స‌క‌ల జ‌నుల స‌మ్మెలో కేసీఆర్ కు, టీఆర్ ఎస్ పార్టీకి అన్ని విధాలా స‌హ‌క‌రించిన గ‌ద్వాల వాసుల కోరిక‌ను నెర‌వేర్చ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంద‌ని అన్నారు.

వాస్త‌వానికి కొత్త జిల్లాల ప్ర‌స్తావ‌న కంటే ముందు నుంచి గ‌ద్వాలను జిల్లా చేయాల‌నే డిమాండ్ ప్ర‌జ‌ల్లో ఉంది. అందుకే, వీరు తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఈ ప్రాంతాన్ని జిల్లాగా చేయాల‌ని కోరుతున్నారు. కొత్త జిల్లాల జాబితాలో గ‌ద్వాల‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఈ ప్రాంతంలో ఆందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. వీటికి డీకే త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి స్వ‌యంగా ప‌లు ఆందోళ‌న‌ల్లో పాల్గొన్నారు. గ‌త జూలై 19 నుంచి 22 వ‌ర‌కు గ‌ద్వాల‌ను జిల్లా చేయాల‌ని ఇటిక్యాల‌, మాన‌వ‌పాడు, ఆలంపూర్ త‌దిత‌ర ప్రాంతాల మీదుగా 30 గ్రామాల్లో దాదాపు 60 కిలోమీట‌ర్ల మేర ఈ పాద‌యాత్ర చేశారు. అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసినా ప్ర‌భుత్వం ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోక‌పోవ‌డంతో చివ‌రగా.. రాజీనామాకు సిద్ధ‌ప‌డ్డారు డీకే అరుణ‌.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News