"ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే"...బాబుకు షాక్ ఇచ్చిన సర్వే

ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు మరో సర్వే చేయించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే ఎన్ని సీట్లు టీడీపీకి వస్తాయన్న దానిపై చంద్రబాబు ఒక ప్రముఖ సంస్థ ద్వారా రహస్య సర్వే నిర్వహించారట. ఈ విషయాన్నిఒక ప్రముఖ మీడియా వెల్లడించింది. తనకున్న విశ్వసనీయ సమాచారంతో కథనం రాసినట్టు వెల్లడించింది. అయితే సదరు సర్వే ఫలితాలను చూసి చంద్రబాబు బిత్తరపోయారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 51 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధిస్తుందని సర్వే […]

Advertisement
Update: 2016-08-23 10:24 GMT

ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు మరో సర్వే చేయించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్తే ఎన్ని సీట్లు టీడీపీకి వస్తాయన్న దానిపై చంద్రబాబు ఒక ప్రముఖ సంస్థ ద్వారా రహస్య సర్వే నిర్వహించారట. ఈ విషయాన్నిఒక ప్రముఖ మీడియా వెల్లడించింది. తనకున్న విశ్వసనీయ సమాచారంతో కథనం రాసినట్టు వెల్లడించింది. అయితే సదరు సర్వే ఫలితాలను చూసి చంద్రబాబు బిత్తరపోయారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 51 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధిస్తుందని సర్వే తేల్చినట్టు చెబుతున్నారు. దీంతో అధినాయకత్వంలో ఆందోళన మొదలైందంటున్నారు. ప్రభుత్వ పనితీరు ఇలాగే ఉంటే రానురాను వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని సర్వే ఫలితాల్లో తేలిందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారట. పరిస్థితి ఎందుకు ఇంతగా దెబ్బతింది ?, ఏం చేయాలి?, ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణాలు వంటి వాటిపై చర్చించారని మీడియా సంస్థ వెల్లడించింది.

మొన్నటి ఎన్నికల్లో తటస్థ ఓటర్లు చంద్రబాబు వైపు మొగ్గారని, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదని సర్వేలో తేలినట్టు చెబుతున్నారు. మొత్తం మీద మొన్నటి వరకు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదు, ప్రభుత్వం పనితీరు మాత్రం అద్భుతంగా ఉందంటూ సర్వే లీకులిచ్చిన చంద్రబాబుకు తాజా సర్వే పెద్ద షాకే. ఇప్పటికిప్పుడు 51 స్థానాలు మాత్రమే గెలవడం అంటే అధికారాన్ని కోల్పోవడమే. మరో మూడేళ్ల కాలంలో పరిస్థితి ఇంకా ఏ రూపు తీసుకుంటుందో. మొత్తానికి సర్వే మాత్రం ప్రజల నాడిని కరెక్ట్‌గానే పట్టిందని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా తప్పులు సరిచేసుకుని ముందుకు వెళ్లకపోతే తీవ్ర నష్టం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News