మెడల్స్ ఇస్తే సరిపోదు, డబ్బులివ్వండి " అక్షయ్

అందరికీ అతని అంత పెద్ద మనసు ఉండడం అరుదు. బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాంటి పెద్ద మనసు ఉన్న వ్యక్తులలో డెఫినిట్‌గా ఒక్కరనే చెప్పాలి. మహారాష్ట్రలో కరువు వచ్చి రైతులు అవస్థలు పడుతుంటే… చందాలు అంటూ బయలుదేరకుండా.. తానే రూ. 90 లక్షలు విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం వీర జవాను కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షలు విరాళం ఇచ్చి తన మంచి […]

Advertisement
Update: 2016-08-16 10:30 GMT

అందరికీ అతని అంత పెద్ద మనసు ఉండడం అరుదు. బాలివుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాంటి పెద్ద మనసు ఉన్న వ్యక్తులలో డెఫినిట్‌గా ఒక్కరనే చెప్పాలి. మహారాష్ట్రలో కరువు వచ్చి రైతులు అవస్థలు పడుతుంటే… చందాలు అంటూ బయలుదేరకుండా.. తానే రూ. 90 లక్షలు విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రస్తుతం వీర జవాను కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.80 లక్షలు విరాళం ఇచ్చి తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు. “పతకాలు ప్రశంసలు ఇస్తే సరిపోదు. కొంత ప్రాక్టికల్‌గా ఆలోచించండి. వారికి డబ్బులు కూడా అవసరమే. డబ్బు రూపేనా జవానుల కుటుంబాలను ఆదుకోవలసిన అవసరం ఉంది, ” అని అక్షయ్ చెప్పింది అక్షరాలా నిజం. పతకాలు, ప్రశంసలు అన్నం పెట్టవు కదా! గొప్ప మనసుకు జోహార్లు మరి.!

Also Read

జిబ్రాన్ కుటుంబం అంతా ఆత్మహ‌త్య చేసుకుందామ‌నుకున్నారు..?

 

Tags:    
Advertisement

Similar News