పార్టీ మార్పుపై రోజా స్పందన... "అసలు ఎక్కడ మొదలైంది..?"

పార్టీ వీడుతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆమె ఈ విషయం చెప్పారు. కొందరు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. అయితే రోజా పార్టీ వీడుతున్నట్టు ఇటీవల కొందరు టీడీపీ వ్యక్తులు సోషల్‌మీడియాలో పదేపదే పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది రోజాకు బాగా చికాకు కలిగించే వ్యవహారంలా […]

Advertisement
Update: 2016-08-14 03:02 GMT

పార్టీ వీడుతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆమె ఈ విషయం చెప్పారు. కొందరు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆ ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. అయితే రోజా పార్టీ వీడుతున్నట్టు ఇటీవల కొందరు టీడీపీ వ్యక్తులు సోషల్‌మీడియాలో పదేపదే పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇది రోజాకు బాగా చికాకు కలిగించే వ్యవహారంలా తయారైంది. ఒకటి, రెండు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హోదాలో రోజా పాల్గొనడాన్ని చూపెడుతూ రోజా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలో ఒక్క రోజానే కాకుండా విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం సహజమే. కానీ వైసీపీ తరపునుండి చంద్రబాబు & కో పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారిలో రోజా ముందుస్థానంలో ఉన్నారు. అందుకే ఆమెపై వైసీపీ నాయకత్వానికి అనుమానం కలిగించేలా కుట్రపూరితంగానే ఇలా కొందరు టీడీపీకి అనుకూలమైనవారు ప్రచారం చేస్తున్నారని రోజా వర్గీయుల ఆరోపణ.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News