వెంక‌య్యను ఇరికించిన డీఎస్...

ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల కోసం తాము కృషి  చేస్తామ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మందక్రిష్ణ‌కు భ‌రోసా ఇచ్చాడు. మాదిగ‌కులాల రిజ‌ర్వేష‌న్ కోసం ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వ‌ర్యంలో మంద‌క్రిష్ణ మాదిగ చేస్తోన్న 23 రోజుల దీక్ష బుధ‌వారంతో ముగిసింది. ఈ సంద‌ర్భంగా ముగింపు స‌మావేశానికి కేంద్ర‌మంత్రులు వెంక‌య్య‌, ద‌త్తాత్రేయ‌లు, టీఆర్ ఎస్ ఎంపీ డీ. శ్రీ‌నివాస్‌ హాజ‌ర‌య్యారు. వేదిక‌పై వెంక‌య్య ప్ర‌సంగిస్తూ.. మాదిగ‌ల రిజ‌ర్వేష‌న్ డిమాండ్‌లో న్యాయం ఉంద‌న్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తాను […]

Advertisement
Update: 2016-08-11 02:24 GMT
ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల కోసం తాము కృషి చేస్తామ‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు మందక్రిష్ణ‌కు భ‌రోసా ఇచ్చాడు. మాదిగ‌కులాల రిజ‌ర్వేష‌న్ కోసం ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వ‌ర్యంలో మంద‌క్రిష్ణ మాదిగ చేస్తోన్న 23 రోజుల దీక్ష బుధ‌వారంతో ముగిసింది. ఈ సంద‌ర్భంగా ముగింపు స‌మావేశానికి కేంద్ర‌మంత్రులు వెంక‌య్య‌, ద‌త్తాత్రేయ‌లు, టీఆర్ ఎస్ ఎంపీ డీ. శ్రీ‌నివాస్‌ హాజ‌ర‌య్యారు. వేదిక‌పై వెంక‌య్య ప్ర‌సంగిస్తూ.. మాదిగ‌ల రిజ‌ర్వేష‌న్ డిమాండ్‌లో న్యాయం ఉంద‌న్నారు. జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్ చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తాను కూడా స‌మ‌ర్ధిస్తామ‌న్నారు. ఈ పోరాటంలో తానుకూడా మ‌ద్ద‌తుగా ఉంటాన‌న్నారు. ఏపీలో ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లోనే తాను ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని అసెంబ్లీలో ప్ర‌స్తావించాన‌ని గుర్తు చేశారు. వెంక‌య్య ప్ర‌సంగంతో మంద‌క్రిష్ణ సంతోష‌ప‌డ్డారు. కృత‌జ్ఞ‌తగా వెంక‌య్య కాళ్ల మీద ప‌డి న‌మ‌స్కారం చేశారు. మాదిగ‌ల వెన‌క అంబేద్క‌ర్‌లా ఉండి మ‌మ్మ‌ల్ని న‌డిపించాల‌ని మందక్రిష్ణ కోరారు.
ఆ త‌రువాత ప్ర‌సంగించిన టీఆర్ ఎస్ ఎంపీ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్ బీజేపీని ఇరుకున పెట్టాడు. ఎస్సీ రిజ‌ర్వేష‌న్ల‌కు అనుగుణంగా ఇప్పుడు వెంక‌య్య గారు ఇచ్చిన హామీని గుర్తుంచుకోవాల‌ని స‌భాముఖంగా కోరారు. తమ‌పార్టీ కూడా రిజ‌ర్వేష‌న్లకు పూర్తిగా మ‌ద్ద‌తిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. జ‌నాభా దామాషా ప్ర‌కారం.. రిజ‌ర్వేష‌న్లు జ‌ర‌గాల‌ని అన్నారు. డీ. శ్రీ‌నివాస్ యథాలాపంగా వెంక‌య్య‌గారి మాట గురించి ప్ర‌స్తావించారు. కానీ, సాధార‌ణ మాట‌లు కావ‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా స‌మ‌యంలో పార్ల‌మెంటులోనూ వెంక‌య్య మాట్లాడిన మాట‌ల‌ను మ‌రిచిపోయార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న వేళ డీ. శ్రీ‌నివాస్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మొత్తానికి వెంక‌య్య‌ను డీఎస్ ఇరికించాడ‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News