ఇది జగన్ నేరవాల్సిన గుణపాఠమే!

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్స్ గా మారి దశాబ్దాలే గడిచింది. కానీ ఏనాడు వైఎస్ రాజకీయానికి ఆ అంశం అడ్డుకాలేదు. హిందువులు కూడా వైఎస్‌ను ఒక మతానికి చెందిన వ్యక్తిగాచూడలేదు. కానీ 2014 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీని ఈ అంశం బాగానే ఇబ్బంది పెట్టింది. ప్రత్యర్థులు, దాని అనుకూల మీడియా పనిగట్టుకుని సున్నిత అంశాల విషయంలోనూ తెలివిగానే ప్రజలను రెచ్చగొట్టింది. అయితే ఇది ప్రత్యర్థి పార్టీ సమర్థత అనడం కన్నా వైసీపీ నిర్లక్ష్యం, అహంకారం కూడా […]

Advertisement
Update: 2016-08-10 22:01 GMT

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్స్ గా మారి దశాబ్దాలే గడిచింది. కానీ ఏనాడు వైఎస్ రాజకీయానికి ఆ అంశం అడ్డుకాలేదు. హిందువులు కూడా వైఎస్‌ను ఒక మతానికి చెందిన వ్యక్తిగాచూడలేదు. కానీ 2014 ఎన్నికల సమయంలో మాత్రం వైసీపీని ఈ అంశం బాగానే ఇబ్బంది పెట్టింది. ప్రత్యర్థులు, దాని అనుకూల మీడియా పనిగట్టుకుని సున్నిత అంశాల విషయంలోనూ తెలివిగానే ప్రజలను రెచ్చగొట్టింది. అయితే ఇది ప్రత్యర్థి పార్టీ సమర్థత అనడం కన్నా వైసీపీ నిర్లక్ష్యం, అహంకారం కూడా ముఖ్యకారణమేనని చెప్పాలి. తనపై కొన్ని సున్నిత అంశాల ఆధారంగా దాడి జరుగుతున్నప్పటికీ జగన్‌ మాత్రం ఎక్కడా స్పందించలేదు. పైగా ప్రత్యర్థుల ప్రచారానికి సాక్ష్యాలను కూడా అందించింది.

ఒక సారి జగన్‌ తిరుమల వెళ్లిన సమయంలో చెప్పులు వేసుకుని గుడి వద్దకు వెళ్లారని ఒక వర్గం మీడియా హోరెత్తించింది. కానీ చెప్పులు వేసుకుని గుడి వద్దకు వెళ్లేంత సంస్కారహీనుడు జగన్‌ కాదని ఈ ఏడు ఎనిమిది ఏళ్లలో అతడి తీరును గమనిస్తే అనిపిస్తుంది. కానీ తిరుమల గుడి వద్దకు తాను చెప్పులు వేసుకుని వెళ్లానంటూ ప్రచారం జరుగుతున్నా అప్పట్లో జగన్ కనీసం స్పందించలేదు. ఆ పార్టీ నుంచి కూడా ఖండనలేదు. అప్పటి వరకు జగన్‌కే ఓటు వేయాలనుకున్న సాధారణ జనం మరో ఆలోచన చేయడానికి ఈ అంశం కూడా ఒక మార్గం చూపింది. వైసీపీపై ఒక వర్గంలో వ్యతిరేకతను బాగా పెంచిన అంశం విజయమ్మ బైబిల్‌ తీసుకుని ప్రచారం చేయడం. విజయమ్మ బైబిల్‌ తీసుకుని ప్రచారానికి వెళ్లిన సమయంలో హిందు ఓటర్లు, వైసీపీని అభిమానించేవారు కూడా పెదవి విరిచారు. కానీ ఎన్నికల ప్రచారం మొత్తం అదే ధోరణి సాగింది. ఈ అంశం ఏ విధంగా ప్రజలపై ప్రభావం చూపుతోందన్న అంశాన్ని ఆ పార్టీ పసిగట్టలేకపోవడం ఆశ్చర్యమే. జగన్ చుట్టూ ఉన్న వారైనా ఈ విషయంలో ఆయన్ను ఎందుకు అప్రమత్తం చేయలేదో!.

బహుశా తమకెందుకులే అనుకున్నారేమో!. ఒక వేళ అదే నిజమైతే అలాంటి వారిని చుట్టూ పెట్టుకోవడం వల్ల జగన్‌కు ఎప్పటికీ ఉపయోగం ఉండదు. భగవద్గీత పట్టుకుని వెళ్లి క్రిస్టియన్లను ఓట్లడిగితే ఎలా ఉంటుంది?. అదే భగవద్గీత పట్టుకుని ముస్లిం ఓటర్లతో మమేకం అయితే ఫలితం ఉంటుందా?. మరి హిందు ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట బైబిల్‌ తీసుకుని వెళ్లడం కూడా అలాంటిదేనన్న విషయం జగన్‌ ఎందుకు గమనించలేదో!. ప్రపంచ యుద్ధాన్ని ఆపింది తానేనని చెప్పుకుని జనానికి ఆశ్చర్యం కలిగించిన మత బోధకుడు కేఏ పాల్‌ గురించి తెలియనంత అమాయకుడు చంద్రబాబు కాదు. కానీ ఎన్నికల సమయంలో కేఏ పాల్‌తో భేటీ అయి గంట సేపు పాల్‌ ఏం చెబుతున్నా ఓపిగ్గా విన్న వ్యక్తి చంద్రబాబు. అన్ని మతాలకు తాను సమానుడునని చెప్పుకునేందుకు చంద్రబాబు ఆ ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల సమయంలో అప్పటి వరకు జగన్‌పై సానుభూతితో గానీ, వైఎస్‌పై అభిమానం వల్ల గానీ జగన్‌ను తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకున్న వారు కూడా సున్నితమైన అంశాల్లో వైసీపీ తీరుతో మనసు మార్చుకున్న మాట నిజం. తండ్రిపోయి ఇబ్బందులుపడుతున్నాడు సరే ఈసారికి ఓటేద్దామనుకున్న తటస్థ ఓటర్ల అభిప్రాయంపై ప్రభావం చూపింది. అయితే ఎన్నికల తర్వాత జగన్‌ ఈ విషయంపై బాగానే పోస్టుమార్టం చేసుకున్నట్టు ఉన్నారు.

హిందూస్వామీజీలను కలుస్తున్నారు. ఆ విషయం ప్రపంచానికి కూడా తెలిసేలా చేస్తున్నారు. తాజాగా రిషికేష్ వెళ్లి యజ్ఞంలో పాల్గొడం కూడా అలాంటిదే. నాయకుడిగా ఉండాలనుకున్న వారు అన్ని విశ్వాసాలను గౌరవించడమే కాదు… ఆ విషయం ప్రజలకు కూడా అర్థమయ్యేలా చూసుకోవాలి. అయితే ఇక్కడ ఆశ్చర్యమేమిటంటే… ఎన్నికల ముందు హిందూమతానికి చంద్రబాబే సర్వరక్షకుడు అని ఒక వర్గం మీడియా చూపెట్టింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏ హిందూ కార్యక్రమానికి వెళ్లినా, హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగే పూజలకు హాజరైనా కాళ్లకు చెప్పులు తీయడం లేదు. చెప్పులు వేసుకునే కొబ్బరి కాయకొట్టడం, షూ విప్పకుండానే గుమ్మడి కాయలు కొట్టడం, మనవుడు పుట్టిన సమయంలో అంటు ఉండగానే( ఇది నమ్మకమా?. మూడ నమ్మకమా అన్నది వేరే అంశం) శంకుస్థాపనలు చేయడం వంటి హిందూ సాంప్రదాయ వ్యతిరేక కార్యక్రమాల్లో మాత్రం చంద్రబాబు చురుగ్గానే పాల్గొంటున్నారు. కానీ చంద్రబాబు చెప్పులు మాత్రం తెలుగు మీడియాకు కనిపించకపోవడం ఆశ్చర్యమే.

– రామనాథ్‌ నార్పల

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News