పని చేసేవాడు ఒట్లు పెట్టడు.. రేవంత్‌పై కేసీఆర్ సెటైర్లు

ఏం తప్పు చేశానని తన గొంతు నొక్కెందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయన్నారు కేసీఆర్.

Advertisement
Update: 2024-05-04 02:45 GMT

సీఎం రేవంత్‌ రెడ్డి ఒట్లపై స్పందించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ప్రచారంపై 48 గంటల నిషేధం ముగియడంతో శుక్రవారం రాత్రి గోదావరిఖనిలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. పని చేసేవాడు ఎవడు దేవుళ్లపై ఒట్లు పెట్టడన్నారు. కేవలం తొండి చేసేవాడు మాత్రమే దేవుళ్లపై ఒట్లు పెడతాడన్నారు.

తాను ఏం తప్పు చేశానని తన గొంతు నొక్కెందుకు కాంగ్రెస్‌, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. బస్సు యాత్రతో కాంగ్రెస్, బీజేపీ నేతల గుండెలు వణుకుతున్నాయన్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం విధించారన్నారు. రాజకీయాలల్లో మతం గురించి మాట్లాడడం తప్పని.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. రోజూ అమిత్ షా, మోడీ మతాల మధ్య గొడవలు పెడుతూ మాట్లాడుతుంటే ఈసీకి కనిపించట్లేదా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి పేగులు మెడకేసుకుంటా, గుడ్లు పీకుతా, పండబెట్టి తొక్కుతా అని మాట్లాడినా ఈసీకి కనిపించదన్నారు. నేతన్నల కోసం మాట్లాడితే తనపై నిషేధం పెట్టారన్నారు.

తాను సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదని, ఇప్పుడు రేవంత్ సర్కార్ అదానీకి గేట్లు తెరిచిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత సింగరేణిని మోడీ,రేవంత్ కలిసి అదానీకి కట్టబెట్టడం ఖాయమన్నారు. గతంలో మంచిగా ఉన్న సింగరేణిని ముంచిందే కాంగ్రెస్‌ పార్టీ అన్నారు కేసీఆర్. సింగరేణిపై కుట్ర జరుగుతోందన్నారు.

Tags:    
Advertisement

Similar News

ఇకపై TGPSC, TGRTC