బాలకృష్ణ సినిమాలో భారీ మార్పు

అంతా సజావుగా సాగుతుందనుకున్న బాలకృష్ణ సినిమాలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు లేనట్టే. అయితే ఈ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీనే తప్పుకున్నాడా…లేక మేకర్సే ఇతడ్ని తప్పించారా అనే విషయంపై క్లారిటీ లేదు.  అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే… వరుస సినిమాలతో బిజీగా ఉన్న దేవిశ్రీప్రసాద్… గౌతమీపుత్ర శాతకర్ణి […]

Advertisement
Update: 2016-08-09 22:32 GMT
అంతా సజావుగా సాగుతుందనుకున్న బాలకృష్ణ సినిమాలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం… బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు లేనట్టే. అయితే ఈ ప్రాజెక్టు నుంచి దేవిశ్రీనే తప్పుకున్నాడా…లేక మేకర్సే ఇతడ్ని తప్పించారా అనే విషయంపై క్లారిటీ లేదు.
అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే… వరుస సినిమాలతో బిజీగా ఉన్న దేవిశ్రీప్రసాద్… గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంగీతం అందించలేకపోతున్నాడట. పైగా ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న కారణంగా… అప్పటికి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించలేకపోతున్నాడట. అందుకే స్వచ్ఛంధంగానే శాతకర్ణి సినిమా నుంచి దేవిశ్రీప్రసాద్ తప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బాలయ్యతో సంప్రదించిన తర్వాతే దేవిశ్రీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇప్పటికే శాతకర్ణి సినిమా కోసం అమెరికాలో కొన్ని పాటలు, మరికొన్ని థీమ్స్ కంపోజ్ చేశాడు. వాటిని దర్శకుడు క్రిష్ ఓకే కూడా చేశాడు. మరి ఆ పాటల్ని, థీమ్ మ్యూజిక్ ను సినిమా కోసం వాడుకుంటారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News