ప్ర‌ధాని స‌భ వ‌ల్ల ఒక‌రోజు ఆల‌స్యం!

న‌యీం హ‌తం వెన‌క ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు ఇప్పుడిప్పుడే తెర‌పైకి వ‌స్తున్నాయి. మొన్న ఆదివారం నాడే న‌యీంను ప‌ట్టుకునేందుకు పోలీసులు శ‌నివారం రాత్రే ఉచ్చుబిగించారు. కానీ, తెల్ల‌వారితే ప్ర‌ధాని స‌భ ఉండ‌టంతో ప్లాన్ 24 గంట‌లు వాయిదా వేసుకున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు నయీంను ప‌ట్టుకునే ప‌నిని పోలీసుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం 6 నెల‌ల కిందే అప్ప‌గించింది. కానీ, డిపార్టుమెంటులో ఉన్న ప‌లువురు అధికారులు ఈ స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు న‌యీంకు చేర‌వేయ‌డంతో త‌ప్పించుకున్నారు. దీంతో ఈప‌నిని ఎస్ […]

Advertisement
Update: 2016-08-08 21:00 GMT
న‌యీం హ‌తం వెన‌క ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు ఇప్పుడిప్పుడే తెర‌పైకి వ‌స్తున్నాయి. మొన్న ఆదివారం నాడే న‌యీంను ప‌ట్టుకునేందుకు పోలీసులు శ‌నివారం రాత్రే ఉచ్చుబిగించారు. కానీ, తెల్ల‌వారితే ప్ర‌ధాని స‌భ ఉండ‌టంతో ప్లాన్ 24 గంట‌లు వాయిదా వేసుకున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు నయీంను ప‌ట్టుకునే ప‌నిని పోలీసుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం 6 నెల‌ల కిందే అప్ప‌గించింది. కానీ, డిపార్టుమెంటులో ఉన్న ప‌లువురు అధికారులు ఈ స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు న‌యీంకు చేర‌వేయ‌డంతో త‌ప్పించుకున్నారు. దీంతో ఈప‌నిని ఎస్ ఐబీ, కౌంట‌ర్ ఇంట‌లిజెన్స్ వింగ్ కి అప్ప‌గించారు. ముగ్గురు ప్ర‌త్యేక అధికారుల‌తో వేట కొన‌సాగించారు. తెలంగాణ‌, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌లో అత‌ని కోసం తీవ్రంగా గాలింపు మొద‌లు పెట్టారు.
ఈనెల మొద‌టి వారంలో నిజామ‌బాద్‌లో ఓ రియ‌ల్ట‌ర్ ను కోటిరూపాయ‌లు కావాల‌ని బెదిరించ‌డంతో అత‌ను పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఆ నెంబ‌రు న‌యీం వాడుతున్న‌దే కావ‌డంతో సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా జీపీఎస్ సాయంతో అత‌ని స్థావ‌రాల‌పై క‌న్నేశారు. కాల్ డేటా ఆధారంగా అత‌ని ఇద్ద‌రు అనుచ‌రుల్ని ముందే ప‌ట్టుకుని విచారించారు. వారిచ్చిన స‌మాచారం, సెల్‌ఫోన్ సిగ్న‌ళ్ల ఆధారంగా న‌యీం త‌ర‌చుగా మిలీనియం టౌన్‌షిప్‌లోకి వ‌స్తున్నాడ‌ని గుర్తించారు. శ‌నివారం అర్ధ‌రాత్రే స‌జీవంగా ప‌ట్టుకోవాల‌ని ప్లాన్ వేశారు. తెల్ల‌వారితే ప్ర‌ధాని మోదీ స‌భ ఉండ‌టంతో వెన‌క్కి త‌గ్గారు. దీంతో న‌యీం వేట ఆదివారం రాత్రికి మారింది. న‌యీం ఇంట్లోనే ఉన్నాడ‌ని నిర్ధారించుకున్న త‌రువాతే.. పోలీసులు ఇంటిపై దాడి చేశారు. వారి రాక‌ను ప‌సిగ‌ట్టిన న‌యీం పోలీసుల నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో పోలీసు కాల్పుల్లో హ‌త‌మ‌య్యాడు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News