జగన్ చెప్పింది నిజమైంది... వైసీపీ నేతకు గట్టి షాక్

ఇటీవల జరిగిన నెల్లూరు యువభేరిలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరును వివరిస్తూ జగన్ ఒక ఉదాహరణ చెప్పారు. కదిరి వైసీపీ కో ఆర్డినేటర్‌ సిద్ధారెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా వివరించారు. కదిరి కో- ఆర్డినేటర్‌గా నియమించే సమయంలో సిద్దారెడ్డితో జరిగిన సంభాషణను జగన్‌ వెల్లడించారు. సిద్ధారెడ్డికి కదిరిలో సాయినాథ్‌ ఆస్పత్రి ఉంది. అక్కడ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. కాబట్టి వైసీపీ కో ఆర్డినేటర్‌గా నియమిస్తే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తుందేమో ఆలోచించుకో అని […]

Advertisement
Update: 2016-08-07 21:11 GMT

ఇటీవల జరిగిన నెల్లూరు యువభేరిలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరును వివరిస్తూ జగన్ ఒక ఉదాహరణ చెప్పారు. కదిరి వైసీపీ కో ఆర్డినేటర్‌ సిద్ధారెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా వివరించారు. కదిరి కో- ఆర్డినేటర్‌గా నియమించే సమయంలో సిద్దారెడ్డితో జరిగిన సంభాషణను జగన్‌ వెల్లడించారు. సిద్ధారెడ్డికి కదిరిలో సాయినాథ్‌ ఆస్పత్రి ఉంది. అక్కడ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కూడా చేస్తుంటారు. కాబట్టి వైసీపీ కో ఆర్డినేటర్‌గా నియమిస్తే ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తుందేమో ఆలోచించుకో అని జగన్ చెప్పారట. అయితే సిద్ధారెడ్డి మాత్రం ఇప్పటికే ఎనిమిది నెలలుగా ఆరోగ్యశ్రీ నిధులు ప్రభుత్వం నుంచి రావడం లేదని, కాబట్టి ఆ విషయం పట్టించుకోకుండా తనను అవకాశం ఉంటే నియోజకవర్గ కో- ఆర్డినేటర్‌గా నియమించాలని కోరారట. దీంతో సిద్ధారెడ్డిని కో – ఆర్డినేటర్‌గా నియమించారు. ఈ విషయాన్ని నెల్లూరు యువభేరిలో జగనే వివరించారు.

అయితే జగన్‌ వ్యక్తం చేసిన అనుమానమే నిజమైంది. సిద్ధారెడ్డికి చెందిన ఆస్పత్రిని ఎన్టీఆర్‌ వైద్య సేవ ఆస్పత్రుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆస్పత్రిలో పార్కింగ్‌ సౌకర్యం లేదు. క్యాంటీన్ ఒప్పంద పత్రం లేదు, వైద్యుల వివరాలు ఆన్‌లైన్‌లో లేవు వంటి తొమ్మిది కారణాలు చూపి ఆస్పత్రిని ఎన్టీఆర్ వైద్యసేవ లిస్ట్‌ నుంచి తొలగించివేశారు. మొత్తానికి కదిరి వైసీపీ కో ఆర్డినేటర్‌ పదవి వచ్చింది… ఆస్పత్రికి ఎన్టీఆర్ వైద్యసేవ పోయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News