వ్యాస్‌, పటోళ్ల, శివుడు, రాములును నయీమ్ చంపిన తీరిదే...

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ హతమయ్యాడు. గ్రేహౌండ్స్ పోలీసులు అతడిని షాద్‌నగర్‌ సమీపంలో ఎన్‌కౌంటర్ చేశారు. నయీమ్ చేసిన నేరాలు అన్ని ఇన్నీ కాదు. దాదాపు30కిపైగా హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గ్రేహౌండ్స్ రూపకర్త వ్యాస్‌ను హత్య చేసిన టీంలోనూ నయీమ్ ఒకడు. 1993 జనవరి 27న సాయంత్రం వేళ ఎల్బీ స్టేడియంలో వ్యాస్ వాకింగ్‌ చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పటికి నయీమ్‌ కూడా నక్సలైట్లలో ఉన్నాడు. అనంతరం కొద్దికాలానికి నయీమ్ అరెస్ట్ అయ్యాడు. ఆసమయంలోనే […]

Advertisement
Update: 2016-08-08 01:20 GMT

మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ హతమయ్యాడు. గ్రేహౌండ్స్ పోలీసులు అతడిని షాద్‌నగర్‌ సమీపంలో ఎన్‌కౌంటర్ చేశారు. నయీమ్ చేసిన నేరాలు అన్ని ఇన్నీ కాదు. దాదాపు30కిపైగా హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గ్రేహౌండ్స్ రూపకర్త వ్యాస్‌ను హత్య చేసిన టీంలోనూ నయీమ్ ఒకడు. 1993 జనవరి 27న సాయంత్రం వేళ ఎల్బీ స్టేడియంలో వ్యాస్ వాకింగ్‌ చేస్తుండగా నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పటికి నయీమ్‌ కూడా నక్సలైట్లలో ఉన్నాడు. అనంతరం కొద్దికాలానికి నయీమ్ అరెస్ట్ అయ్యాడు. ఆసమయంలోనే మావోయిస్టు అగ్రనేతలు పటోళ్లసుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావుతో నయీమ్‌కు విభేదాలు వచ్చి దళం నుంచి బయటకువచ్చాడు. అప్పటి నుంచి సొంత గ్యాంగ్ స్థాపించుకుని హత్యలు, సెటిల్‌మెంట్లు, దందాలు చేయడం మొదలుపెట్టాడు. మావోయిస్టుల మీద కక్ష పెంచుకున్నాడు.

2011 మార్చిలో మాజీ మావోయిస్ట్ , టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడిని హత్య చేయించాడు నయీమ్. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం సంగెంలో జరిగిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తుండగా రెండు వాహనాల్లో వచ్చిన నయీమ్ అనుచరులు వేటకొడవళ్లతో విచక్షనరహితంగా నరికి సాంబశివుడిని చంపారు. 2014 మార్చిలో సాంబశివుడి సోదరుడు, టీఆర్‌ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు కొనపురి రాములు(40)ను దారుణంగా హత్య చేసింది నయీమ్ గ్యాంగ్. ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు నల్లగొండకు రావడంతో దుండగులు పథకం ప్రకారం రాములుని హత్య చేశారు. ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారం వద్దే మాటువేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా రాములుపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి చంపేశారు.

విప్లవ దేశభక్త పులుల సంస్థ వ్యవస్థాపకుడు,పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉండి నిర్దోషిగా విడుదలైన పటోళ్ల గోవర్దన్ రెడ్డిని కూడా నయీమ్ గ్యాంగ్ హత్య చేసింది. హైదరాబాదులోని సుల్తాన్ బజార్‌ పోలీసు స్టేషన్ పరిధిలో బొగ్గులకుంట ప్రాంతంలో అతన్ని దారుణంగా హత్య చేశారు. ఆటోలో ప్రయాణిస్తున్న గోవర్ధన్ రెడ్డిని డాగర్స్, కత్తులతో దాడి చేసి చంపారు. పటోళ్ల గోవర్ధన్ రెడ్డి శరీరంపై 13 కత్తిపోట్లు ఉన్నాయి.

ప్రజాజీవితంలో ఉన్న నక్సల్ సానుభూతిపరులు, వారికోసమే పనిచేస్తున్న వారిని, హక్కుల సంఘాల ముఖ్యనేతలను కూడా నయీమ్ టార్గెట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నేతలు పురుషోత్తం, ఆజం అలీ, తెలంగాణ జనసభ గాయని బెల్లి లలితను నయీమ్ హత్య చేయించాడు. నయీమ్ ఇంతకాలం దర్జాగా నేరాలు చేయడం వెనుక పోలీసు ఉన్నతాధికారుల హస్తం కూడా ఉందని చెబుతుంటారు. కొందరు పోలీసు అధికారులు నయీంతో కుమ్మక్కైనందువల్లే నయీమ్‌ను పట్టుకోవడం కష్టమైందని చెబుతుంటారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News