నయీమ్‌పై ఫిర్యాదు చేసింది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే...

నయీమ్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రేరేపించిన కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రత్యేక ముఠాను ఏర్పాటు చేసుకుని హత్యలు, దందాలకు పాల్పడుతున్న నయీమ్ ఇటీవల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నయీం టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. డిచ్ పల్లి టీఆర్ఎస్ జెడ్పీటీసీ భర్త గంగాధర్ కు గత నెల ఫోన్ చేసిన […]

Advertisement
Update: 2016-08-08 02:50 GMT

నయీమ్‌ ఎన్‌కౌంటర్‌కు ప్రేరేపించిన కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రత్యేక ముఠాను ఏర్పాటు చేసుకుని హత్యలు, దందాలకు పాల్పడుతున్న నయీమ్ ఇటీవల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేశారు. నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను నయీం టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. డిచ్ పల్లి టీఆర్ఎస్ జెడ్పీటీసీ భర్త గంగాధర్ కు గత నెల ఫోన్ చేసిన నయీం కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. డబ్బులివ్వకుంటే చంపేస్తామని బెదిరించాడు. మీ కుటుంబసభ్యులు ఎక్కడ ఉంటారో తెలుసని కోటి ఇవ్వకుంటే తీవ్రంగా నష్టపోతావని హెచ్చరించారు. దీంతో గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులనే నయీం బెదిరించే స్థాయిలో పరిస్థితి ఉండడం చూసి కేసీఆర్‌ కూడా ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. నయీం టార్గెట్‌ చేయడంతో భువనగిరి ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ఇటీవల కేటాయించారు. ఎమ్మెల్యేల ఫిర్యాదు తర్వాత కేసీఆర్‌ పోలీసులపై చాలా సీరియస్ అయినట్టు చెబుతున్నారు. ప్రైవేట్ గ్యాంగులు అధికార పార్టీ ఎమ్మెల్యేలనే బెదరిస్తుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారట. అయితే నయీంకు పోలీస్ డిపార్టమెంట్‌లోని కొందరు అధికారుల సహకారం ఉండడంతో ఆపరేషన్ నయీంను చాలా సీక్రెట్‌గా అమలు చేశారు.

నయీంను వేటాడే విషయం కొందరు కీలక అధికారులకు మాత్రమే తెలుసని చెబుతున్నారు. నయీం సోదరుడు అలీబాయ్ ఉత్సవ కమిటీ అని ఒక దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నిర్వహించే వినాయక ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యేలు పైల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశంను నయీం బెదిరించాడని కూడా సమాచారం. అయితే వారు ఆ ఉత్సవాలకు హాజరుకాలేదు. అప్పటి నుంచి వారిని నయీం గ్యాంగు బెదిరిస్తూనే ఉంది. మొత్తం మీద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నయీం టార్గెట్ చేయడం, సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా స్పందించడం వంటి ఘటనల తర్వాతే నయీంను పోలీసులు హతమార్చినట్టు చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News