మోదీకి హిందీ వంద‌నాలు.. బాబుకు చుర‌క‌లు!

గ‌జ్వేల్‌లోని కోమ‌టిబండ‌లో జ‌రిగిన స‌మావేశంలో కేసీఆర్ త‌న వాక్ప‌టిమ‌ను, మాట‌కారితనాన్ని మ‌రోసారి ప్ర‌దర్శించారు. తన ప్ర‌సంగం మొత్తం హిందీలోనే సాగించారు. త‌ద్వారా జాతీయ మీడియాకు త‌న సందేశాన్ని సులువుగా చేర‌వేయ‌గ‌లిగారు. కొత్త రాష్ర్టానికి మాకేమీ వ‌ద్ద‌ని కేవ‌లం మీ నుంచి  మీ స‌హాయ స‌హ‌కారాలు, ప్రేమ‌, ఆశీర్వాదం మాత్ర‌మే ఆశిస్తున్నామ‌న్నారు.  రాష్ర్టానికి ప్ర‌త్యేక ప్యాకేజీలు వ‌ద్దంటూనే  రాష్ట్ర స‌మ‌స్య‌లు తీర్చాల‌ని ప్ర‌ధానిని త‌న‌దైన శైలిలో కోరారు. తెలంగాణ‌కు ఒక జాతీయ ప్రాజెక్టు అందించాల‌ని, ఉన్న ప్రాజెక్టుల‌కు మీ […]

Advertisement
Update: 2016-08-07 22:25 GMT
గ‌జ్వేల్‌లోని కోమ‌టిబండ‌లో జ‌రిగిన స‌మావేశంలో కేసీఆర్ త‌న వాక్ప‌టిమ‌ను, మాట‌కారితనాన్ని మ‌రోసారి ప్ర‌దర్శించారు. తన ప్ర‌సంగం మొత్తం హిందీలోనే సాగించారు. త‌ద్వారా జాతీయ మీడియాకు త‌న సందేశాన్ని సులువుగా చేర‌వేయ‌గ‌లిగారు. కొత్త రాష్ర్టానికి మాకేమీ వ‌ద్ద‌ని కేవ‌లం మీ నుంచి మీ స‌హాయ స‌హ‌కారాలు, ప్రేమ‌, ఆశీర్వాదం మాత్ర‌మే ఆశిస్తున్నామ‌న్నారు. రాష్ర్టానికి ప్ర‌త్యేక ప్యాకేజీలు వ‌ద్దంటూనే రాష్ట్ర స‌మ‌స్య‌లు తీర్చాల‌ని ప్ర‌ధానిని త‌న‌దైన శైలిలో కోరారు. తెలంగాణ‌కు ఒక జాతీయ ప్రాజెక్టు అందించాల‌ని, ఉన్న ప్రాజెక్టుల‌కు మీ స‌హాయ స‌హ‌కారాలు కావాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేసీఆర్ ప్రసంగం సాంతం విన్న మోదీ కూడా అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో కేసీఆర్ హిందీ ప్ర‌సంగానికి సార్థ‌క‌త చేకూరిన‌ట్ల‌యింది.
మొత్తానికి మోదీకి హిందీలో వంద‌నాలు తెలియ‌జేస్తూనే.. బాబుకు చుర‌క‌లు కూడా అంటించారు. తెలంగాణ రెండేళ్ల కొత్త రాష్ట్రం ఒక ముఖ్య‌మంత్రిగా రాజ్యాన్ని న‌డిపించే వ్య‌క్తిగా నాకు బాధ్య‌త‌లు, విధివిధానాలు పాల‌నాప‌ర‌మైన ఇబ్బందులు తెలుసు. అందుకే, నేను రూ.50వేల కోట్లు అడ‌గ‌ను. గొంతెమ్మ కోరిక‌లు కోర‌ను అంటూ మోదీకి ఏపీ సీఎం చంద్ర‌బాబు డిమాండ్ల‌ను గుర్తు చేశారు. గ‌తంలో హుద్ హుద్ స‌మ‌యంలో తెలంగాణ‌లో జ‌రిగిన రైతు ఆత్మ‌హ‌త్య‌ల ఫొటోల‌ను విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన రైతుగా చూపించారు. ఆపై మోదీని రూ.1000 కోట్ల సాయం చేయాల‌ని కోరారు. కానీ, కేంద్రం అంత సాయం చేయ‌లేదు. మొత్తానికి చంద్ర‌బాబు పేరు ప్ర‌స్తావించ‌కుండానే.. ఆయ‌న‌కు ఎన్ని చుర‌క‌లు అంటించాలో అన్నీ అంటించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News