సైజులు చూసుకుంటున్న ఏపీ మంత్రులు

దేశానిది ఒక బాధ అయితే తెలుగుదేశం మంత్రులది ఒక బాధ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. లోటు బడ్జెట్‌ అంటూ జనానికి కుచ్చుటోపి పెడుతూ తాము మాత్రం లగ్జరీగా బతికేయాలనుకుంటున్నారు. సాధారణంగా మంత్రులు అద్దె ఇళ్లలో ఉంటే ప్రభుత్వం అద్దె చెల్లించడం చూశాం. కానీ ఏపీ మంత్రులు మాత్రం అటు హైదరాబాద్ ఇటు విజయవాడలోనూ తమ ఇళ్లకు అద్దె చెల్లించాలని పట్టుపడుతున్నారు. ఇంకొ అడుగు ముందుకేసి సీఎం చంద్రబాబుతో పోలిక పెట్టుకుంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌, విజయవాడలో మూడు నాలుగు […]

Advertisement
Update: 2016-08-07 22:22 GMT

దేశానిది ఒక బాధ అయితే తెలుగుదేశం మంత్రులది ఒక బాధ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. లోటు బడ్జెట్‌ అంటూ జనానికి కుచ్చుటోపి పెడుతూ తాము మాత్రం లగ్జరీగా బతికేయాలనుకుంటున్నారు. సాధారణంగా మంత్రులు అద్దె ఇళ్లలో ఉంటే ప్రభుత్వం అద్దె చెల్లించడం చూశాం. కానీ ఏపీ మంత్రులు మాత్రం అటు హైదరాబాద్ ఇటు విజయవాడలోనూ తమ ఇళ్లకు అద్దె చెల్లించాలని పట్టుపడుతున్నారు. ఇంకొ అడుగు ముందుకేసి సీఎం చంద్రబాబుతో పోలిక పెట్టుకుంటున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌, విజయవాడలో మూడు నాలుగు చోట్ల ఇళ్లు, కార్యాలయాలు పెట్టుకుంటే నిధులు మంజూరు చేస్తున్న ఆర్థిక శాఖ తమ విషయంలో మాత్రం అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమకూ సీఎం తరహాలోనే కార్యాలయాలకు, ఇళ్లకు అద్దెలు చెల్లించాలని మంత్రులు పట్టుబడుతున్నారు. వెలగపూడి తాత్కాలిక రాజధానిలో కూర్చుని పనిచేసుకోండి అంటే మంత్రులు కస్సుమంటున్నారు.

తాత్కాలిక రాజధానిలో ఎక్కువ సేపు పనిచేసే సౌకర్యాలు లేవంటున్నారు. మంత్రి నారాయణ పర్యవేక్షణలో సాగిన తాత్కాలిక సచివాలయంలో కొన్ని శాఖలకు కేటాయించిన గదులు చిన్నవిగా ఉన్నాయని మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పక్క శాఖ మంత్రుల గదులతో పోల్చి చూసుకుంటూ ఎవరి గది ఎంత వైశాల్యం ఉందని లెక్కలేసుకుంటున్నారు. పక్క శాఖల మంత్రుల చాంబర్ల కంటే తమ చాంబర్లు చిన్నగా ఉండడం చూసి కొందరు మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి నారాయణపై కారాలుమిరియాలు నూరుతున్నారు. ఇలా తమ చాంబర్లు చిన్నగా ఉన్నాయన్న భావనకు వచ్చిన మంత్రులు… తాము విజయవాడ, గుంటూరులోని అద్దె భవనాల్లోనే ఉంటూ పనిచేస్తామని తేల్చిచెబుతున్నారు. వాటికి ప్రభుత్వమే అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు ఇలా చిల్లరపంచాయితీలు పెట్టుకోవడం చూసి ఉన్నతాధికారులు కూడా నవ్వుకుంటున్నారు. చెట్టు కింద కూర్చోనైనా ఏపీని అభివృద్ధి చేస్తామని మొదట్లో కోతలు కోసిన మంత్రులు ఇప్పుడు… చాంబర్లు కాస్త చిన్నవిగా ఉన్నా ఓర్చుకోలేని స్థాయికి రావడం నవ్వులాటలా తయారైంది. ఆవు చేలో మేస్తే దూడలు గట్టున మేస్తాయా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News