స్నానం ఎప్పుడు చేస్తారో చెప్పండి సర్ " సీఎంకు అధికారి షాక్

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవడానికి కారణం చంద్రబాబేనన్న భావన బలంగా పాతుకుపోయినట్టుగా ఉంది. జనంలోనే కాదు ఉన్నతాధికారుల్లోనూ ఇదే అభిప్రాయం ఉన్నట్టుంది. తాజాగా శుక్రవారం కృష్ణ పుష్కరాల ఏర్పాట్లపై సీఎం నిర్వహించిన సమావేశంలో ఒక అధికారి మనసులో మాట బయటపెట్టారు. దీంతో చంద్రబాబుతో పాటు మిగిలిన అధికారులు కాసేపు అవాక్కయ్యారు. గుడివాడ హోమియో మెడికల్ కాలేజ్‌కు చెందిన అధికారి మాట్లాడుతూ.. ”నేను గోదావరి పుష్కరాల్లోనూ పనిచేశాను సర్. సీఎం వస్తారని చెప్పి భక్తులను […]

Advertisement
Update: 2016-08-05 21:58 GMT

గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవడానికి కారణం చంద్రబాబేనన్న భావన బలంగా పాతుకుపోయినట్టుగా ఉంది. జనంలోనే కాదు ఉన్నతాధికారుల్లోనూ ఇదే అభిప్రాయం ఉన్నట్టుంది. తాజాగా శుక్రవారం కృష్ణ పుష్కరాల ఏర్పాట్లపై సీఎం నిర్వహించిన సమావేశంలో ఒక అధికారి మనసులో మాట బయటపెట్టారు. దీంతో చంద్రబాబుతో పాటు మిగిలిన అధికారులు కాసేపు అవాక్కయ్యారు. గుడివాడ హోమియో మెడికల్ కాలేజ్‌కు చెందిన అధికారి మాట్లాడుతూ.. ”నేను గోదావరి పుష్కరాల్లోనూ పనిచేశాను సర్. సీఎం వస్తారని చెప్పి భక్తులను నిలిపివేశారు. మీరు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా భక్తులను వదిలేసరికి తొక్కిసలాట జరిగిందని నాతో చాలా మంది చెప్పారు. కాబట్టి ఇప్పుడు కృష్ణ పుష్కరాల్లో మీరు స్నానానికి ఎప్పుడు వస్తారో ముందే చెబితే బాగుంటుంది. మేము, భక్తులు అప్రమత్తంగా ఉంటాం ”అని అనేశారు. దీంతో సమావేశంలో కొద్ది నిమిషాల పాటు నిశబ్దం నెలకొందట.

సదరు అధికారి నేరుగా గోదావరి పుష్కర తొక్కిసలాటకు మీరే కారణం అన్నట్టుగా సీఎంతోనే చెప్పేసరికి మిగిలిన అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. అంతటితో ఆగకుండా ఈసారి కూడా మీరు చెప్పాపెట్టకుండా వస్తే మరోసారి ఇబ్బందులు వచ్చేఅవకాశం ఉందన్నట్టుగా అధికారి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాసేపటి తర్వాత ”అలాంటిదేమీ జరగదులే ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం”అని డీజీపీ సర్ధిచెప్పారు. ఆ తర్వాత సీఎం కూడా స్పందించి… గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటకు తనకు ఏమీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ”నేను స్నానం చేసి వస్తుంటే ఒక మహిళ వచ్చి కరెంట్ షాక్ కొట్టి భక్తులు చనిపోయారని చెప్పింది. నేను వెంటనే వెళ్లి కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షించా” అని సీఎం చంద్రబాబు చెప్పుకున్నారు.

Click on Image to Read:

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

Tags:    
Advertisement

Similar News