ఈమాత్రానికే కేసీఆర్ రాజీనామా చేస్తారా?

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు భూ సేక‌ర‌ణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం విడుదల చేసిన జీవో నెంబ‌రు 123ను హైకోర్టు కొట్టివేయ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌ల దాడి మొద‌లైంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా.. అంతా క‌లిసి అధికార ప‌క్షంపై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా జీవో నెంబ‌రు 123 ను హైకోర్టు కొట్టివేసినందు వ‌ల్ల సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల‌ని తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. […]

Advertisement
Update: 2016-08-05 00:50 GMT

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు భూ సేక‌ర‌ణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం విడుదల చేసిన జీవో నెంబ‌రు 123ను హైకోర్టు కొట్టివేయ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై విమ‌ర్శ‌ల దాడి మొద‌లైంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా.. అంతా క‌లిసి అధికార ప‌క్షంపై మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా జీవో నెంబ‌రు 123 ను హైకోర్టు కొట్టివేసినందు వ‌ల్ల సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల‌ని తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క డిమాండ్ చేశారు. ప‌రిపాల‌న‌లో కేసీఆర్‌ విఫ‌ల‌మయ్యార‌ని తెలిపేందుకు హైకోర్టు తీర్పే నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శించారు. ఆయ‌న‌కు ప‌రిపాల‌న‌పై ఏమాత్రం అవ‌గాహ‌న లేద‌ని ఎద్దేవా చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్మాణానికి సేక‌రించిన భూమిని తిరిగి ఇచ్చేయాల‌ని డిమాండ్ చేశారు. ఒక‌వేళ ప్రాజెక్టులు క‌ట్టాల‌నుకుంటే.. 2013లో త‌మ పార్టీ తెచ్చిన భూసేక‌ర‌ణ చ‌ట్టం ప్ర‌కారం.. భూ నిర్వాసితుల‌కు ప‌రిహారం చెల్లించాల‌ని సూచించారు.

దీనిపై గులాబీనేత‌లు మండిప‌డుతున్నారు. జ‌ల‌య‌జ్ఞం కింద చేప‌ట్టిన ప్రాజెక్టుల నిర్మాణ స‌మ‌యంలో మీరు ఎక‌రానికి ఎంత ప‌రిహారం చెల్లించార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంక దేశంలో రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాలేమ‌ని తెలుసుకునే పోతూపోతూ 2013 భూసేక‌ర‌ణ చ‌ట్టం దేశంపై రుద్దిపోయార‌ని విమ‌ర్శిస్తున్నారు. మీ ప‌నుల‌న్నీ పూర్తయి.. ఇక తిరిగి గెలవ‌మ‌ని తెలిసే.. ఎన్నిక‌ల ముందు ఇలాంటి చ‌ట్టం తెచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప‌రిహారం విష‌యంలో బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాలు విసురుతున్నారు. కాంగ్రెస్ హ‌యాంలో కంటే తాము మెరుగైన ప‌రిహారం ఇస్తున్నామ‌ని తెలితే మీ వ్యాఖ్య‌లు వెన‌క్కి తీసుకుంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

Click on Image to Read:

Also Read క‌బాలిని కూడా వ‌ద‌ల్లేదు..!

17 ఏళ్ల త‌ర్వాత గౌత‌మిని చూడ‌బోతున్నాం…!

విడాకులు తీసుకోవడం గ్యారెంటీ…

Tags:    
Advertisement

Similar News