పరిటాల అనుచరుడు... 27 ఏళ్లకే మూడు హత్యలు, చివరకు హతం

రెండేళ్లకాలంలో అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్న భావన వ్యక్తమవుతోంది. జిల్లా రాజకీయాలను శాసించాలనుకుంటున్న టీడీపీ యువ నేతలు… నేరస్తులకు అండగా నిలుస్తుండడంతో వారి ఆగడాలకు హద్దుఅదుపు లేకుండాపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. డీజీపీ జేవీ రాముడి సొంత జిల్లా అయినప్పటికీ టీడీపీ నేతల అండ ఉండడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. తాజాగా శుక్రవారం అనంతపురం నగర సమీపంలో జరిగిన పరిటాల శ్రీరామ్‌ అనుచరులు గోపినాయక్, వెంకటేష్ నాయక్‌ల హత్యల బ్యాక్ గ్రౌండేఇందుకు నిదర్శనమంటున్నారు. నిన్న హత్యకు గురైన గోపినాయక్ […]

Advertisement
Update: 2016-07-22 09:47 GMT

రెండేళ్లకాలంలో అనంతపురం జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్న భావన వ్యక్తమవుతోంది. జిల్లా రాజకీయాలను శాసించాలనుకుంటున్న టీడీపీ యువ నేతలు… నేరస్తులకు అండగా నిలుస్తుండడంతో వారి ఆగడాలకు హద్దుఅదుపు లేకుండాపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. డీజీపీ జేవీ రాముడి సొంత జిల్లా అయినప్పటికీ టీడీపీ నేతల అండ ఉండడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. తాజాగా శుక్రవారం అనంతపురం నగర సమీపంలో జరిగిన పరిటాల శ్రీరామ్‌ అనుచరులు గోపినాయక్, వెంకటేష్ నాయక్‌ల హత్యల బ్యాక్ గ్రౌండేఇందుకు నిదర్శనమంటున్నారు.

నిన్న హత్యకు గురైన గోపినాయక్ వయసు 27 ఏళ్లే. కానీ ఇతడిపై ఇప్పటికే మూడు హత్య కేసులు నమోదయ్యాయని స్థానిక సీఐ సాయిప్రసాద్ చెప్పారు. ముదిగుబ్బకు చెందిన గోపినాయక్ కొద్దిరోజుల క్రితమే అనంతపురం వచ్చాడు. తొలుత చిన్నచిన్న దందాలు చేసేవాడు. ఇందుకు వెంకటేశ్, ఆకులప్ప, అమర్‌తో కలిసి ఒక గ్రూప్ కట్టాడు. అలా అందరూ కలిసి సెటిల్మెంట్లు చేయడం మొదలుపెట్టారు. నగర శివారులో కొత్త భూములు కొనాలన్నా అమ్మాలన్నా వీరి కనుసన్నల్లోనే జరిగేవి. వీరికి పరిటాల కుటుంబం అండ కూడా దొరకడంతో మరింత రెచ్చిపోయారు. ఇటీవల అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ నగర శివారులోని వికలాంగుల కాలనీలో ఒక్కొక్కరి నుంచి రూ. 50వేలు వసూలు చేసింది ఈ ముఠా.

ఆ డబ్బు విషయంలోనే గోపినాయక్‌కు ఆకులప్ప, అమర్‌ గ్రూప్‌లకు మధ్య గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో కాపు కాచి వేటకొడవళ్లతో గోపినాయక్‌, 31 ఏళ్ల వెంకటేశ్‌ నాయక్‌లను ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. ప్రాణభయంతో గోపినాయక్‌ కేకలు వేసినా ప్రత్యర్థులు వెంటాడి దారుణంగా చంపేశారు. చనిపోయే సమయంలో గోపినాయక్ ఎంతగా భయపడ్డాడో అద్దంపట్టేలా చనిపోయిన తర్వాత కూడా తెరిచే ఉన్న అతడు కళ్లను బట్టి అర్థమవుతోంది. హతులు గోపినాయక్‌, వెంకటేశ్‌ మృతదేహాలను ఆస్పత్రిలో మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ పరిశీలించారు. ఈ హత్య వెనుక టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హస్తముందని పరిటాల వర్గం ఆరోపిస్తోంది.

మొత్తం మీద టీడీపీ నేతల అండ చూసుకునే ఇలాంటి ముఠాలు అనంత నగరంలో భయోత్పాతం సృష్టిస్తున్నాయన్న విమర్శలు బలంగా ఉన్నాయి. డిజిపి సొంత జిల్లా కేంద్రమైన అనంతలోనే ఇంతటి ఆరాచకం నడవడం బట్టే శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. రెండేళ్ల కాలంలో పలువురు వైసీపీ నేతలను కూడా ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించి మరీ హత్యలు చేయడాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. అయితే ఎస్టీ సంఘాలు మాత్రం కొందరు నాయకులు రాజకీయ ఎదుగుదల కోసం ఎస్టీలను వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పెద్ద నాయకులు బాగానే ఉంటున్నా గుడ్డిగా నమ్మి వెళ్తున్న వెనుకబడిన వర్గాల వారే బలైపోతున్నారని ఆవేదన చెందుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News