గుంటూరు మంత్రికి భార్య పోటు, ఆ మంత్రి ఆయనేనా?

గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రికి భార్య ద్వారా లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. ఆయన రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ లోకల్‌లో మాత్రం భార్యదే హవా. భర్త శాఖలోనే ఉన్నతాధికారులకు కూడా ఆమె నేరుగా ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రిగారి భార్య వైద్య సిబ్బందిపై మూడో కన్ను తెరిచారు. తన కోరిక అమలయ్యేలా చూడాలని భర్తకు సైగ చేశారు. చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రి సిబ్బంది తనను కలవడం లేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని […]

Advertisement
Update: 2016-07-18 21:26 GMT

గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రికి భార్య ద్వారా లేనిపోని తలనొప్పులు వస్తున్నాయి. ఆయన రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ లోకల్‌లో మాత్రం భార్యదే హవా. భర్త శాఖలోనే ఉన్నతాధికారులకు కూడా ఆమె నేరుగా ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా మంత్రిగారి భార్య వైద్య సిబ్బందిపై మూడో కన్ను తెరిచారు. తన కోరిక అమలయ్యేలా చూడాలని భర్తకు సైగ చేశారు. చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రి సిబ్బంది తనను కలవడం లేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహించిన మంత్రి భార్య వెంటనే మూకుమ్మడిగా 14 మందిని బదిలీ చేయించారు.

మొదట్లో బదిలీకి అధికారులు తటపటాయించగా భర్తపై ఒత్తిడి తెచ్చారు. భార్య పట్టింపు చూసిన సదరు మంత్రి నేరుగా వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను ఆశ్రయించారట. ఎలాగైనా ఆస్పత్రి సిబ్బందిని బదిలీ చేయాలని విన్నవించుకున్నారు. సాటి మంత్రి పరిస్థితిని అర్థం చేసుకున్న కామినేని వెంటనే 14 మంది సిబ్బందినీ బదిలీ చేసేశారని ప్రముఖ పత్రిక కథనాన్ని కూడా ప్రచురించింది. దీంతో ఇప్పుడు చిలకలూరి పేట ఆస్పత్రిలో సిబ్బంది లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భార్య కొంగుచాటు మంత్రి కారణంగా తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆస్పత్రిలోని మిగిలిన సిబ్బంది, రోగులు వాపోతున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…

కొద్ది రోజుల క్రితం గుంటూరుజిల్లాకే చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు ఒక టీవీఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మీ భార్య మీ శాఖలో జోక్యం చేసుకుని చివరకు ఐఏఎస్‌లకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా… అలాంటిది ఏమీ లేదని పుల్లారావు చెప్పారు. కేవలం నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నించి ఉండవచ్చన్నారు. తన భార్య విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్నింగ్ ఇచ్చారన్న వార్తలు కూడా అవాస్తవం అని పుల్లారావు చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News