వైసీపీ ఒక పనికిమాలిన పార్టీ... గోదావరిని నేను ప్రార్ధించా...

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పనికిమాలిన పార్టీగా తయారైందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ అడ్డుపడినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. పట్టిసీమ అసాధ్యమన్నారని కానీ సాధ్యం చేసి చూపించామన్నారు. ఏడాదిలోనే రెండు నదులను కలిపిన ప్రభుత్వం తమదేనన్నారు. 177 కి.మీ దూరంలోని రెండు నదులను కలిపామన్నారు. కానీ 177 కిలోమీటర్ల కాలువలను ఎవరు తవ్వారన్నది మాత్రం చెప్పలేదు. గత ప్రభుత్వం పోలవరం కోసం తవ్విన కాలువల్లోనే పట్టిసీమ నీటిని పారిస్తున్నట్టు మాత్రం చంద్రబాబు చెప్పలేదు. తనలో […]

Advertisement
Update: 2016-07-19 05:54 GMT

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పనికిమాలిన పార్టీగా తయారైందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. వైసీపీ అడ్డుపడినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. పట్టిసీమ అసాధ్యమన్నారని కానీ సాధ్యం చేసి చూపించామన్నారు. ఏడాదిలోనే రెండు నదులను కలిపిన ప్రభుత్వం తమదేనన్నారు. 177 కి.మీ దూరంలోని రెండు నదులను కలిపామన్నారు. కానీ 177 కిలోమీటర్ల కాలువలను ఎవరు తవ్వారన్నది మాత్రం చెప్పలేదు.

గత ప్రభుత్వం పోలవరం కోసం తవ్విన కాలువల్లోనే పట్టిసీమ నీటిని పారిస్తున్నట్టు మాత్రం చంద్రబాబు చెప్పలేదు. తనలో ఒక సంకల్పం ఉందన్నారు. సాధ్యమనుకుంటే ఏదైనా చేయడం సాధ్యమవుతుందన్నారు. గత పుష్కరాలలో చల్లగా చూడాలని తాను గోదావరి తల్లిని ప్రార్ధించానని, ఇప్పుడు గోదావరి కృష్ణమ్మ చెంతకు వచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరో ఏడాదిలో కృష్ణ-పెన్నా నదులను కూడా అనుసంధానం చేసేస్తామన్నారు చంద్రబాబు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి… ఈ మేరకు కృష్ణానది నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు తరలిస్తామంటూ ఎప్పటిలాగే సీమ జనానికి ఊహాచిత్రాన్ని చంద్రబాబు చూపించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News