రెండో సినిమాకు రెడీ అవుతున్న నిహారిక

మొదటి సినిమాతోనే ఆగిపోతుందనుకున్న నిహారిక ఇప్పుడు రెండో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. సింగిల్ సినిమా భామగానే మిగిలిపోతుందనుకున్నమెగా హీరోయిన్ రెండో సినిమా చేయడానికే ఫిక్స్ అయింది. మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడానికే మొగ్గుచూపుతోంది. మరీ ముఖ్యంగా మొదటి సినిమాలో కాస్తోకూస్తో హీరోయిన్ ఛాయలున్న క్యారెక్టర్ లో కనిపించిన నిహారిక.. తన రెండో సినిమాకే ఫుల్ లెంగ్త్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాను సెలక్ట్ చేసుకుంది.  మరాఠీలో హిట్టయిన హ్యాపీ జర్నీ […]

Advertisement
Update: 2016-07-18 10:20 GMT
మొదటి సినిమాతోనే ఆగిపోతుందనుకున్న నిహారిక ఇప్పుడు రెండో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. సింగిల్ సినిమా భామగానే మిగిలిపోతుందనుకున్నమెగా హీరోయిన్ రెండో సినిమా చేయడానికే ఫిక్స్ అయింది. మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా హీరోయిన్ గా కెరీర్ కొనసాగించడానికే మొగ్గుచూపుతోంది. మరీ ముఖ్యంగా మొదటి సినిమాలో కాస్తోకూస్తో హీరోయిన్ ఛాయలున్న క్యారెక్టర్ లో కనిపించిన నిహారిక.. తన రెండో సినిమాకే ఫుల్ లెంగ్త్ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాను సెలక్ట్ చేసుకుంది.
మరాఠీలో హిట్టయిన హ్యాపీ జర్నీ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి నిహారిక రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తన సోదరుడ్ని వెదుక్కుంటూ ఓ యువతి చేసే ప్రయాణమే ఈ సినిమా కథ. మరాఠీలో ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఇందులో లీడ్ రోల్ చేసేందుకు నిహారిక రెడీ అవుతోంది. ఆమె అన్నయ్యగా హర్షవర్థన్ రాణె నటించనున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. ఒక మనసు సినిమాను తెరకెక్కించిన రామరాజుకే మరోసారి దర్శకత్వం బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. “సినిమా చూపిస్త మామ” లాంటి పలు సినిమాలు నిర్మించిన బెక్కం వేణుగోపాల్ ఈ నయా ప్రాజెక్టుకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News