సాగరమథనం చేసిన దేవతల వంటి వాడే జగన్‌

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఒక ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం తనను అవమానించిన తీరును వివరించారు. ఎన్టీఆర్‌ చనిపోగానే ఇంట్లో ఉన్న డబ్బును కూడా ఎత్తుకెళ్లారని చెప్పారు. ఒక వ్యక్తి దగ్గర తన నగలు ఉంచితే వాటిని కూడా ఇవ్వకుండా మోసం చేశారని చెప్పారు. ఎన్టీఆర్ కుమారులు, కూతుర్లు కలిసి తనకు నిలువ నీడ లేకుండా ఇంటిని కూడా లాక్కున్నారని వివరించారు. ఎన్టీఆర్‌పై ఆయన కొడుకులకు, కూతుర్లకు ప్రేమ అన్నది ఏమాత్రం లేదన్నారు. […]

Advertisement
Update: 2016-07-12 10:20 GMT

ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి ఒక ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబం తనను అవమానించిన తీరును వివరించారు. ఎన్టీఆర్‌ చనిపోగానే ఇంట్లో ఉన్న డబ్బును కూడా ఎత్తుకెళ్లారని చెప్పారు. ఒక వ్యక్తి దగ్గర తన నగలు ఉంచితే వాటిని కూడా ఇవ్వకుండా మోసం చేశారని చెప్పారు. ఎన్టీఆర్ కుమారులు, కూతుర్లు కలిసి తనకు నిలువ నీడ లేకుండా ఇంటిని కూడా లాక్కున్నారని వివరించారు. ఎన్టీఆర్‌పై ఆయన కొడుకులకు, కూతుర్లకు ప్రేమ అన్నది ఏమాత్రం లేదన్నారు. వారిదంతా డబ్బు వ్యామోహమేనని విమర్శించారు. ఎన్టీఆర్‌ను ఆయన కుటుంబం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని అందుకే తనను అంతగా ప్రేమించారని లక్ష్మీ పార్వతి చెప్పారు.

టీడీపీ గొడుగు నీడలో చంద్రబాబు, టీడీపీనేతలు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. తన కుమారుడి కోసం చంద్రబాబు మరింత రెచ్చిపోయి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారామె. చట్టాలు, ఈసీ, గవర్నర్‌ ఇలా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి టీడీపీని చంద్రబాబు లాక్కున్నారని ఆవేదన చెందారు. ఈ అరాచకశక్తులు, దుర్మార్గుల ఓటమి చూసేందుకు తాను బతికున్నానని చెప్పారు. తనను అందరూ అవమానించి రోడ్డు మీద నిలబెట్టిన సమయంలో జగన్ ఒక కొడుకులాగా తనను చేరదీశాడని అన్నారు. అండగా నిలిచి, పోరాడేందుకు వేదికనిచ్చి జగన్ పార్టీలో తాను ఉన్నందుకు భర్తగా ఎన్టీఆర్ ఆత్మ నిజంగానే సంతోషిస్తుందని చెప్పారు. చిన్నపిల్లాడిపై తండ్రి చనిపోయిన వెంటనే సోనియాగాంధీతో కలిసి కేసులు వేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. కనీసం జగన్‌కు నిలదొక్కుకునే అవకాశం కూడా ఇవ్వకుండా జైలుకు పంపారని అన్నారు.

వేల కోట్లు దోచుకుంటున్న టీడీపీ నేతలు జగన్‌పై అవినీతి ఆరోపణలు చేసే ముందు వారివారి మనసును ప్రశ్నించుకోవాలని సూచించారు. చంద్రబాబు ఆస్తులన్నీ సింగపూర్‌లో ఉన్న విషయం అందరికీ తెలుసన్నారు. విజయమ్మ కేసులు వేస్తే స్టేలు తెచ్చుకుని మేనేజ్ చేసుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఒకప్పుడు దేవతలు క్షీరసాగరమథనం చేస్తే తొలుత విషం వచ్చిందని, ఆ తర్వాత అప్సరసలు వచ్చారని గుర్తు చేశారు. కానీ దేవతలు విషాన్ని చూసి బెదరలేదు, అప్సరసల వ్యామోహానికి లోను కాలేదని చెప్పారు. అమృతం సాధించే వరకు లక్ష్యం కోసమే పనిచేశారన్నారు. అలాంటి ధీరచరిత జగన్‌ మోహన్ రెడ్డిలో కనిపించిందన్నారు. ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని, లక్ష్యాన్ని చేరే వరకూ వారు పోరు విరమించబోరని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ అమాయకుడని అతడికి పార్టీని నడిపేంత శక్తి లేదన్నారు. పవన్‌ కల్యాణ్ కూడా చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తి అన్నారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవియే రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారని… పవన్ పార్టీ పెట్టినా నిలవడం సాధ్యం కాదన్నారు.

Click on Image to Read –

Tags:    
Advertisement

Similar News