ఘట్టమనేనికే నోటీసులిచ్చి ప్రాసిక్యూట్ చేయగలరా?

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీని అధికారులు లెక్కచేస్తున్నట్టు కనిపించడం లేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే కారెంకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కారెం శివాజీ మండిపడ్డారు. శివాజీ తాను జిల్లా పర్యటనకువస్తున్నట్టు ఈనెల 5నే జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపారు. సోమవారం ఉదయం జెడ్పీ మీటింగ్ హాల్‌లో సమీక్ష సమావేశం ఉంటుందని కూడా వివరించారు. అయితే భేటీకి […]

Advertisement
Update: 2016-07-11 23:17 GMT

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీని అధికారులు లెక్కచేస్తున్నట్టు కనిపించడం లేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే కారెంకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నిర్వహించిన సమీక్ష సమావేశానికి కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కారెం శివాజీ మండిపడ్డారు.

శివాజీ తాను జిల్లా పర్యటనకువస్తున్నట్టు ఈనెల 5నే జిల్లా యంత్రాంగానికి సమాచారం పంపారు. సోమవారం ఉదయం జెడ్పీ మీటింగ్ హాల్‌లో సమీక్ష సమావేశం ఉంటుందని కూడా వివరించారు. అయితే భేటీకి కలెక్టర్‌, చిత్తూరు ఎస్పీ, తిరుపతి ఎస్పీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, తిరుపతి, మదనపల్లె సబ్‌ కలెక్టర్లు హాజరుకాలేదు. దీంతో కారెం శివాజీ ఆగ్రహించారు. కలెక్టర్, ఎస్పీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్టు చెప్పారు. వారి నుంచి సరైన వివరణ రాకపోతే ప్రాసిక్యూట్ చేస్తామన్నారు. అయితే చంద్రబాబు సొంత జిల్లాలో పనిచేస్తున్న ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌తో పాటు కలెక్టర్‌, ఇతర అధికారులకు కారెం నోటీసులు జారీ చేసి వారిని ప్రాసిక్యూట్ చేయించగలరా?. అదే జరిగితే చంద్రబాబు ఊరుకుంటారా?. కారెం శివాజీ నోటీసులను చూసి ఎస్పీ, కలెక్టర్లు భయపడతారో, కిసుక్కున నవ్వుకుంటారో చూడాలి.

click on image to read-

Tags:    
Advertisement

Similar News