హైకోర్టు చెవిలో సీసీ కెమెరా " బాబు కామెడీ

హైకోర్టు కాదు సుప్రీంకోర్టు చెప్పినా తమకు నచ్చిందే చేస్తాం తప్ప.. ఎవరో ఆదేశించారని తాము పనులు చేయబోమన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది. తాజాగా టెన్త్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించగా ఏపీప్రభుత్వం చెప్పిన సాకు హైకోర్టుకే షాక్‌ ఇచ్చింది. మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ విచారణ […]

Advertisement
Update: 2016-07-11 23:14 GMT

హైకోర్టు కాదు సుప్రీంకోర్టు చెప్పినా తమకు నచ్చిందే చేస్తాం తప్ప.. ఎవరో ఆదేశించారని తాము పనులు చేయబోమన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం తయారైంది. తాజాగా టెన్త్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించగా ఏపీప్రభుత్వం చెప్పిన సాకు హైకోర్టుకే షాక్‌ ఇచ్చింది.

మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ విచారణ సోమవారం జరిగింది. మొన్నటి పరీక్షల సందర్భంగా కొన్ని చోట్ల తెలంగాణ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, ఓ కేంద్రంలో ఐదేళ్లుగా 100% ఫలితాలు వస్తుండగా, సీసీ కెమెరాల ఏర్పాటు తరువాత ఫలితాలు 47 శాతానికి పడిపోయాయని పిటిషనర్ తరపు న్యాయవాది వివరించారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఇకపై అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అయితే ఏపీ ప్రభుత్వం అందుకు తమ వల్ల కాదని చెప్పింది. ఎప్పటిలాగే తమది పేద రాష్ట్రమని కాబట్టి సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన రూ. 36కోట్లు ఖర్చు పెట్టలేమని హైకోర్టులో బీదఅరుపులు అరిచింది. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించారు. అసలు ఏపీ బడ్జెట్ ఎంత అని ప్రశ్నించింది. దీనికి న్యాయవాది బదులివ్వలేకపోయారు. దీంతో జోక్యం చేసుకున్న ఏపీ అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ … తమది లోటు బడ్జెట్ అని, కోర్టు ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని మరోసారి కోరారు. అయితే ప్రభుత్వ వాదనను కోర్టు సమర్థించలేదు. రూ.36 కోట్లు స్వల్ప మొత్తమని, సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ఈ ఖర్చు చేయాల్సిందేనని, ఇది ఎంత మాత్రం వృథా కాబోదని ధర్మాసనం తెలిపింది.

చంద్రబాబు సొంత విమానాలకు చేస్తున్న వందల కోట్లతో పోలిస్తే రూ. 36కోట్లు ఎంత?. చంద్రబాబు హైదరాబాద్‌, విజయవాడలో తన నివాసాల నిర్మాణానికి, ఆఫీసుల మరమ్మతులకు పెట్టే వృథాతో పోలిస్తే 36 కోట్లు ఏపాటివి?. పుష్కరాల వేరుతో గోదావరిలో రెండు వేల కోట్లు, కృష్ణా పుష్కరాల పేరుతో తమ్ముళ్లు దోచుకుంటున్న వందల కోట్లతో పోలిస్తే పిల్లల చదవులకు అవసరమైన రూ. 36 కోట్లు ఒక లెక్కనా?. పబ్లిసిటీ కోసం తగేలేస్తున్న వందల కోట్ల ముందు ఈ 36 కోట్లు వృథానా?. అయినా లోటు బడ్జెట్ అన్న ఒకే నినాదంతో కోట్లాది మంది ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం… ఇప్పుడు హైకోర్టుకు అదే పని చేయబోయింది. కోర్టులంటే ఉన్న గౌరవం అలాంటిది మరి.

click on image to read-

Tags:    
Advertisement

Similar News