పుష్కరాల అవినీతికి కొత్తమార్గం- 'టైమ్స్ ఆఫ్ ఇండియా" ప్రత్యేక కథనం

చంద్రబాబు పాలనలో అవినీతి పొంగిపొర్లుతోంది. కృష్ణా నదికి వరద సంగతి ఏమో గానీ కృష్ణ పుష్కరాల్లో మాత్రం టీడీపీ నేతలు అవినీతి వరదను సృష్టిస్తున్నారు. ఆలస్యం చేసి మరీ అవినీతికి తెరలేపారు. ఈ నిజాలను తెలుగు మీడియా కప్పిపుచ్చుతున్నా జాతీయ మీడియా మాత్రం వదిలిపెట్టడం లేదు. తాజాగా కృష్ణ పుష్కరాల్లో టీడీపీ నేతలు ఎలా దోచుకుంటున్నారన్న దానిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద కథనాన్ని అచ్చేసింది. అవినీతికి అవకాశం కలిగేలా పరిస్థితులను సృష్టించిన వైనాన్ని […]

Advertisement
Update: 2016-07-07 01:30 GMT

చంద్రబాబు పాలనలో అవినీతి పొంగిపొర్లుతోంది. కృష్ణా నదికి వరద సంగతి ఏమో గానీ కృష్ణ పుష్కరాల్లో మాత్రం టీడీపీ నేతలు అవినీతి వరదను సృష్టిస్తున్నారు. ఆలస్యం చేసి మరీ అవినీతికి తెరలేపారు. ఈ నిజాలను తెలుగు మీడియా కప్పిపుచ్చుతున్నా జాతీయ మీడియా మాత్రం వదిలిపెట్టడం లేదు. తాజాగా కృష్ణ పుష్కరాల్లో టీడీపీ నేతలు ఎలా దోచుకుంటున్నారన్న దానిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద కథనాన్ని అచ్చేసింది.

అవినీతికి అవకాశం కలిగేలా పరిస్థితులను సృష్టించిన వైనాన్ని వివరించింది. సాధారణంగా అయితే రూ.5 లక్షలకు లోపు పనులను మాత్రమే నామినేషన్‌ పద్దతిలో నేరుగా కేటాయించవచ్చు. అంతకు మించిన విలువ కలిగిన పనులు చేయాలంటే తప్పనిసరిగా టెండర్లు ఆహ్వానించాలి. కానీ ఇక్కడే తెలుగుదేశం నాయకులు కొత్త మార్గం కనిపెట్టారు. పుష్కరాల పనులను కావాలనే చాలా కాలంగా ఆలస్యం చేస్తూ వచ్చారు. జరుగుతున్న పనులను కూడా నత్తతో పోటీగా సాగించారు. దీంతో ఇప్పుడు పనులు పూర్తి చేసేందుకు అవసరమైన సమయం లేకుండాపోయింది. ఈ పరిస్థితిని టీడీపీ నేతలు, కొందరు అధికారులు కావాలనే సృష్టించారని పత్రిక కథనం.

ఇంతకాలం పనులను సాగదీసి… ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కాబట్టి పనులకు టెండర్లు పిలవడం సాధ్యం కాదంటూ బుకాయిస్తున్నారు. కాబట్టి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు గాను పనులకు టెండర్లు లేకుండా నేరుగా నామినేషన్ పద్దతిలో కేటాయించేందుకు సిద్దమయ్యారట. ఈ పనులను కమిషన్లు తీసుకుని కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రయత్నిస్తున్నారట. కొందరు పెద్దలు పనులను మరెవరికో కట్టబెట్టడం ఇష్టం లేక బంధువుల పేరుతో కొత్త‌ కంపెనీలను పెట్టి కోట్ల రూపాయల విలువైన పనులను అప్పగించేస్తున్నారు. ఆర్‌ అండ్ బీ శాఖలోని ఒక ఇంజనీర్‌ ఈ తరహాలోనే కోట్లాది రూపాయల విలువైన విద్యుత్ పరికరాలకు సంబంధించిన కాంట్రాక్టును అప్పగించేశారు.

పనులకు సమయం లేదన్న కారణం చూపుతూ కావాల్సిన వారికి అధిక మొత్తానికి పనులు కట్టబెడుతున్నారని పత్రిక వెల్లడించింది. పుష్కరాలకు 1500 కోట్లు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అది మించి భారీగానే ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయని ఆంగ్ల పత్రిక కథనం. రెవెన్యూ లోటు ఉందని చెప్పే ఏపీ ప్రభుత్వం ఇలా భారీగా పుష్కరాలకు ఖర్చు చేస్తున్న విషయాన్ని కూడా పత్రిక ప్రస్తావించింది. మొత్తం మీద కృష్ణ పుష్కరాల పవిత్రతకు టీడీపీ నేతలు ఇలా ఖ్యాతి తెస్తున్నారన్న మాట.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News