కేఎఫ్‌ బీర్లు బంద్‌.. తెలంగాణలో కొత్త స్కామ్‌!

అడిగిన మొత్తంలో కమీషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Update: 2024-05-27 12:23 GMT

తెలంగాణలోకి కొత్త బీర్లు రాబోతున్నాయి. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్‌లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ సంస్థ రాష్ట్రప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ పేర్లతో కొత్త బీర్లు రాబోతున్నాయని సమాచారం.

కమీషన్‌ను బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవ‌కాశం ఉంద‌నే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లు కనుమరుగై కొత్త బ్రాండ్లు తెరమీదకు వచ్చే అవ‌కాశం ఉంద‌న్న చర్చ జరుగుతోంది.

కొంతకాలంగా రాష్ట్రంలో బీర్ల కొర‌త ఏర్పడిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మ‌ద్యం దుకాణాల్లో బీర్లను అందుబాటులో ఉంచాల‌ని ప‌లువురు ఎక్సైజ్ అధికారుల‌కు ఫిర్యాదులు చేసిన ఘటనలు కూడా చూశాం. అయినా బీర్లు అందుబాటులోకి రాలేదు. బీర్లు దొరక్కపోవడం వెనుక పెద్ద కుట్రే జ‌రిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

RR టాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమీషన్లు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతోంది. అడిగిన మొత్తంలో కమీషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బీర్లు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కొరతను సాకుగా చూపి ఈ కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు ప్రభుత్వం స్కెచ్‌ గీసినట్లుగా చర్చ జరుగుతోంది. తద్వారా భారీగా కమీషన్ పొందేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేసిందిని టాక్. కొత్త బ్రాండ్ల ముసుగులో తెలంగాణలో రూ. 5000 కోట్ల లిక్కర్ స్కాం జ‌రిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News