పరిచూరి బ్రదర్స్‌ను నమ్ముకున్నారా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సినీ డైలాగ్‌ రచయితలు పరుచూరి బ్రదర్స్ కలిశారు. ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలో సీఎంను వారుకలిశారు. సుధీర్ఘంగా చర్చించారు. పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ కూడా వచ్చారు. పరుచూరి బ్రదర్స్‌తో సీఎం కొన్ని కీలక విషయాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రజలను ఆకట్టుకునే డైలాగులు, పంచ్ లైన్ల కోసం వీరిని సీఎం పిలిపించినట్టు చెబుతున్నారు. తొలి నుంచి పబ్లిసిటీ ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్న చంద్రబాబు మరో విడత ఆ ప్రయోగానికి సిద్దమైనట్టు చెబుతున్నారు. పబ్లిసిటీకి […]

Advertisement
Update: 2016-07-06 00:39 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సినీ డైలాగ్‌ రచయితలు పరుచూరి బ్రదర్స్ కలిశారు. ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసంలో సీఎంను వారుకలిశారు. సుధీర్ఘంగా చర్చించారు. పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ కూడా వచ్చారు. పరుచూరి బ్రదర్స్‌తో సీఎం కొన్ని కీలక విషయాలు మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రజలను ఆకట్టుకునే డైలాగులు, పంచ్ లైన్ల కోసం వీరిని సీఎం పిలిపించినట్టు చెబుతున్నారు.

తొలి నుంచి పబ్లిసిటీ ద్వారా ప్రజలను ఆకట్టుకుంటున్న చంద్రబాబు మరో విడత ఆ ప్రయోగానికి సిద్దమైనట్టు చెబుతున్నారు. పబ్లిసిటీకి అవసరమైన పాటలను అనంత్‌ శ్రీరామ్‌తో రాయిస్తారని తెలుస్తోంది. చంద్రబాబు ఈ తరహా ప్రయోగాలు చేయడం ఎప్పటినుంచో వస్తోంది. 2014 ఎన్నికలకు ముందు కూడా సినీరంగానికి చెందిన పలువురు దర్శకులను పిలిపించుకుని చంద్రబాబు ఇదే తరహాలో భేటీ నిర్వహించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఎలాంటి హావభావాలు ఉండాలి, ప్రజల వద్ద ఎలా స్పందించాలి వంటి అంశాలపై ఎన్నికలకు ముందు దర్శకుల దగ్గర చంద్రబాబు సలహాలు స్వీకరించారని చెబతుంటారు. భారీ చిత్రాలు తీస్తున్న దర్శకులు కూడా చంద్రబాబును కలిసినవారిలో ఉన్నారని వార్తలొచ్చాయి. చూడాలి … ఈసారి పరుచూరి వారి ప్రియమైన పంచ్ డైలాగులు చంద్రబాబుకు ఎంతవరకు ఉపయోగపడుతాయో.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News