రజనీకాంత్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ 

ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి… రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 22న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు విడుదల తేదీని ప్రకటిస్తూ… తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఆ రోజున తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి కబాలి సినిమా విడుదలకానుంది. అటు మలేషియాలో కూడా కబాలి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వారం ఆలస్యంగా… ఈనెల 29న కబాలి అక్కడ విడుదలకానుంది. మలయ్ […]

Advertisement
Update: 2016-07-05 01:21 GMT

ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలి… రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 22న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు విడుదల తేదీని ప్రకటిస్తూ… తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఆ రోజున తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ భాషల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి కబాలి సినిమా విడుదలకానుంది. అటు మలేషియాలో కూడా కబాలి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అయితే వారం ఆలస్యంగా… ఈనెల 29న కబాలి అక్కడ విడుదలకానుంది. మలయ్ భాషలో విడుదలవుతున్న మొట్టమొదటి సౌత్ చిత్రంగా కబాలి రికార్డు సృష్టించబోతోంది. తెలుగులో ఈ సినిమా అత్యధికంగా 32 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. కబాలిపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. రజనీ గత సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ… కబాలి ట్రయిలర్, సాంగ్స్, రజనీ గెటప్, డైలాగ్స్ హిట్టు అవ్వడంతో అంచనాలు ఎవరికీ అందని స్థాయికి చేరుకున్నాయి. రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించాడు. సినిమాలో 32 ఏళ్ల యువకుడిగా… 62 ఏళ్ల వృద్ధుడిగా రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు పోషించాడు రజనీకాంత్. అయితే కుర్ర క్యారెక్టర్ కంటే… 62 ఏళ్ల పాత్రతోనే ఎక్కువ మేజిక్ చేయబోతున్నాడట రజనీ.

Advertisement

Similar News