పోలీసుల సాక్షిగా..... రైల్వే స్టేషన్లో డాన్ రొమాన్స్!
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. ఇప్పుడు మన సమాజంలో డబ్బున్న వాడే అందరికంటే పెద్దరాజు. డబ్బున్నవాడికి పోలీసు వర్గాలు, ప్రభుత్వాలు కూడా సలాం చేస్తాయని చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు మరొకసారి రుజువైంది. ప్రస్తుతం తలోజా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న గ్యాంగ్స్టర్ అబూసలేం పని అలాగే ఉంది. అతడిని విచారణ నిమిత్తం పోలీసులు పలుమార్లు లక్నో, ఢిల్లీ వంటి నగరాలకు తీసుకువెళుతుంటారు. ఈ క్రమంలో ప్రయాణాలు చేసే సమయంలో అబూసలేం తన భార్య […]
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. ఇప్పుడు మన సమాజంలో డబ్బున్న వాడే అందరికంటే పెద్దరాజు. డబ్బున్నవాడికి పోలీసు వర్గాలు, ప్రభుత్వాలు కూడా సలాం చేస్తాయని చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు మరొకసారి రుజువైంది. ప్రస్తుతం తలోజా జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న గ్యాంగ్స్టర్ అబూసలేం పని అలాగే ఉంది. అతడిని విచారణ నిమిత్తం పోలీసులు పలుమార్లు లక్నో, ఢిల్లీ వంటి నగరాలకు తీసుకువెళుతుంటారు. ఈ క్రమంలో ప్రయాణాలు చేసే సమయంలో అబూసలేం తన భార్య సయ్యద్ బహార్ కౌసర్ (26)కి భోజనం తినిపిస్తున్న ఫొటోలను మిడ్డే పత్రిక ప్రచురించింది.
అబూసలేం ప్రయాణమార్గంలో రైల్వే స్టేషన్లల్లోని వెయింటింగ్ రూముల్లో తన బార్యను, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నట్టుగా ఈ ఫొటోలను బట్టి తెలుస్తోంది. అతను ఇక్కడ సెల్ఫోన్లో మాట్లాడుతూ కూడా కనిపించాడు. అబూసలేంను వివాహం చేసుకుంటానని, అందుకు అనుమతి కావాలంటూ కౌసర్ గత జూన్లో కోర్టుని కోరింది. అయితే మధ్యలో ఒకసారి ఈ వివాహంతో తన జీవితం నాశనం అయ్యిందని మీడియాముందు వాపోయింది. కానీ తాజా ఫొటోలను బట్టి చూస్తే వారిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. వీరిద్దరి వివాహం కదులుతున్న రైలులో బంధువులు, ఎస్కార్ట్ పోలీసుల సమక్షంలో జరిగిందనే కథనాలు వెలువడ్డాయి.