పొడిచేస్తారని వీరికి ఓటేస్తే ... చంద్రబాబు వీటికి సమాధానం చెప్పాలి...

నటుడు శివాజీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని తిడుతూ చంద్రబాబును కాపాడేందుకు శివాజీ బృందం పనిచేస్తుంటుందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గతానికి భిన్నంగా చంద్రబాబు పాలనపై శివాజీ విరుచుకుపడ్డారు. మూడేళ్ల కాలంలో (నిజానికి చంద్రబాబు సీఎం అయి రెండేళ్లు అయింది) ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రెండేళ్లలో అమరావతిలో ఒక రోడ్డును కూడా వేయలేకపోయారని మండిపడ్డారు. […]

Advertisement
Update: 2016-07-04 00:20 GMT

నటుడు శివాజీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీని తిడుతూ చంద్రబాబును కాపాడేందుకు శివాజీ బృందం పనిచేస్తుంటుందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో గతానికి భిన్నంగా చంద్రబాబు పాలనపై శివాజీ విరుచుకుపడ్డారు. మూడేళ్ల కాలంలో (నిజానికి చంద్రబాబు సీఎం అయి రెండేళ్లు అయింది) ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని ఇప్పుడు వారికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

రెండేళ్లలో అమరావతిలో ఒక రోడ్డును కూడా వేయలేకపోయారని మండిపడ్డారు. తాత్కాలిక సచివాలయం కడితే అక్కడ టాయిలెట్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో ఒక్క కంపెనీ ఏదైనా వచ్చిందా అని ప్రశ్నించారు. వైఎస్ పెట్టిన శ్రీసిటీలో చైనా కంపెనీ ఒక మొబైల్ కంపెనీని పెట్టడం మినహా ఎక్కడైనా ఒక్క పెట్టుబడి వచ్చిందేమో చెప్పాలని డిమాండ్ చేశారు.

నాలుగు ఇంకుడు గుంతలు తవ్వడం మినహా చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. మోదీ, చంద్రబాబు గెలిస్తే ఏదో పొడిచేస్తారని విశాఖ ప్రజలు ఓటేసి బీజేపీ వ్యక్తిని ఎంపీగా గెలిపించారని … వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి ఎందుకు ఓట్లేయాలని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీని టార్గెట్ చేస్తూ చంద్రబాబును కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాను రాష్ట్ర భవిష్యత్తు కోసమే పోరాటం చేస్తున్నామని చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News