హైకోర్టులో స్టే సాధించిన వైసీపీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధానికి రోడ్డు వేస్తామంటూ ప్రభుత్వం గ్రామంలోని ఇళ్లను కూల్చివేతకు సిద్ధమైంది. అయితే బాధితుల పక్షాన వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ చర్యలపై స్టే ఇచ్చింది. బాధితులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు స్టే ఉత్తర్వులను కృష్ణాయపాలెం రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరించడం మానుకోవాలని కోరారు. ఎమ్మెల్యే […]

Advertisement
Update: 2016-07-01 00:31 GMT

గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధానికి రోడ్డు వేస్తామంటూ ప్రభుత్వం గ్రామంలోని ఇళ్లను కూల్చివేతకు సిద్ధమైంది. అయితే బాధితుల పక్షాన వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ చర్యలపై స్టే ఇచ్చింది. బాధితులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇళ్ల కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు స్టే ఉత్తర్వులను కృష్ణాయపాలెం రైతులకు ఎమ్మెల్యే అందజేశారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరించడం మానుకోవాలని కోరారు. ఎమ్మెల్యే చొరవకు కృష్ణాయపాలెం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News