జనగామలో బస్సులను తగలబెట్టిన ఆందోళనకారులు

జనగాంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే వరంగల్ జిల్లాను వరంగల్, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాలుగా విభజిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో జనగామవాసుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. జనగాంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిగిరి యాదగిరిరెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్ఝ్ చేశారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సులపై రాళ్లు రువ్వారు. టీఆర్‌ఎస్‌ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పంటించారు. […]

Advertisement
Update: 2016-07-01 03:19 GMT

జనగాంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే వరంగల్ జిల్లాను వరంగల్, మహబూబాబాద్‌, భూపాలపల్లి జిల్లాలుగా విభజిస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో జనగామవాసుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. జనగాంలో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిగిరి యాదగిరిరెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్ఝ్ చేశారు. దీంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. బస్సులపై రాళ్లు రువ్వారు. టీఆర్‌ఎస్‌ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పంటించారు. రెండు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో జనగాంకు అదనపు బలగాలను తరలించారు.

అటు.. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాలను ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది. ప్రత్యేక జిల్లా ఏర్పాటును కోరుతూ గద్వాల్ జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ. సంతప్ కుమార్ పాల్గొన్నారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో ఎమ్మెల్యేలతో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Click on Image to Read:

 

 

Tags:    
Advertisement

Similar News