గురివిందలు... బాబు గాలిసోకితే అంతేనేమో!

చంద్రబాబుకు పదవి అంటే ప్రీతి ఉంది కాబట్టి జనానికి సబ్సిడీలు ఇస్తున్నారే గానీ… లేకుంటే అందుకు ఆయన మనసు అస్సలు అంగీకరించదు. ఆయన చుట్టూ ఉన్న వారు, చంద్రబాబును సమర్థించే వారి ఆలోచన ధోరణి కూడా దాదాపు అలాగే ఉంటుంది. 2004కు ముందు ఉచిత విద్యుత్‌ను, సబ్బిడీలను వ్యతిరేకించిన చరిత్రకూడా చంద్రబాబుకు ఉంది. అంతెందుకు ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం పథకానికి అప్పట్లో మంగళం పాడింది కూడా చంద్రబాబే. ఇటీవల కొందరు టీడీపీ నేతలు, […]

Advertisement
Update: 2016-06-30 08:52 GMT

చంద్రబాబుకు పదవి అంటే ప్రీతి ఉంది కాబట్టి జనానికి సబ్సిడీలు ఇస్తున్నారే గానీ… లేకుంటే అందుకు ఆయన మనసు అస్సలు అంగీకరించదు. ఆయన చుట్టూ ఉన్న వారు, చంద్రబాబును సమర్థించే వారి ఆలోచన ధోరణి కూడా దాదాపు అలాగే ఉంటుంది. 2004కు ముందు ఉచిత విద్యుత్‌ను, సబ్బిడీలను వ్యతిరేకించిన చరిత్రకూడా చంద్రబాబుకు ఉంది. అంతెందుకు ఎన్టీఆర్ తెచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం పథకానికి అప్పట్లో మంగళం పాడింది కూడా చంద్రబాబే.

ఇటీవల కొందరు టీడీపీ నేతలు, చంద్రబాబుతో స్నేహం చేస్తున్న బీజేపీనేతలు కూడా పేదల సబ్సిడీలపై పడి ఏడుస్తున్నారు. రూపాయి కిలో బియ్యం ఇవ్వడం అవసరమా అని ఎక్కడ మైకులు కనిపించినా టీడీపీ ఎంపీ జేసీదివాకర్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఐదు రూపాయలు పెట్టి టీ తాగుతున్న ప్రస్తుత తరుణంలో రూపాయికి బియ్యం ఇవ్వడం అవసరమా అని ఆవేశంగా ప్రశ్నిస్తుంటారాయన. అయితే జేసీ గారు ఒక విషయం మాత్రం మరిచిపోతున్నారు. ఐదు రూపాయలుపెట్టి టీ తాగే పేదోడికి రూపాయి బియ్యం అవసరమా అంటున్నారు… మరి ఎంపీగా జేసీ గారు ఢిల్లీలో ఎలాంటి సేవలు పొందుతున్నారో జనానికి తెలియదా?.

పార్లమెంట్ క్యాంటీన్‌లో ఎంపీలు ఐదు రూపాయలకే ఫుల్‌ మీల్స్, 20 రూపాయలకే చికెన్ బిర్యాని, ఒక రూపాయికే కాఫీ తాగి తిరగడం లేదా?. ఐదు రూపాయల టీ తాగేవాడి సాధారణ పౌరుడి సబ్సిడీ మీద పదేపదే కన్నెర్ర చేస్తున్న జేసీ గారు… సాధారణంగా ఫైవ్ స్టార్‌ హోటల్లో ఒక్కో టీకి ఎంత చెల్లిస్తారో ఆయనకు గుర్తులేదా?. జేసీకి తోడుగా ఈ మధ్య బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌రాజు కూడా బయలుదేరారు. ఉచితపథకాల వల్ల పల్లెజనం సోమరిపోతులయ్యారని అధికారిక కార్యక్రమంలో సెలవిచ్చారాయన.

పేదలకిచ్చే సబ్సిడీలన్నీ ఎత్తివేయాలని డబ్బున్న మారాజు డిమాండ్ కూడా చేశారు. కానీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు ప్రజాధనం నుంచి సబ్సిడీలు పొందడం లేదా?. సేవ పేరుతో ఎమ్మెల్యేగా పీఠం ఎక్కి లక్షలకు లక్షలు జీతాలు తీసుకోవడంలేదా?. ఆ పక్కజిల్లాలోనే లక్షల కోట్ల విలువైన గ్యాస్ నిక్షేపాలను అంబానీలకు కట్టబెడితే మాట్లాడే దమ్ములేదు కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపడంలో మన నేతలు ముందుంటారు. ఈ నేతలు గురివింద నీతులు మాని…ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు తీసుకోకుండా ఆదర్శంగా నిలబడి అప్పుడు నీతులు చెబితే బాగుంటుంది.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News