రైతుల పిటిషన్‌ కొట్టివేత

తెలంగాణలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ఎత్తిపోతల పథకంపై బాధిత రైతులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రైతులు అడిగిన విధంగానే నష్టపరిహారంచెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు వివరించింది. జీవో 123 ఆధారంగా భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేకపోతే భూసేకరణ చట్టం ద్వారా ముందుకెళ్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు రైతుల పిటిషన్‌ను తోసిపుచ్చింది. మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును […]

Advertisement
Update: 2016-06-27 03:29 GMT

తెలంగాణలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ఎత్తిపోతల పథకంపై బాధిత రైతులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రైతులు అడిగిన విధంగానే నష్టపరిహారంచెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు వివరించింది. జీవో 123 ఆధారంగా భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేకపోతే భూసేకరణ చట్టం ద్వారా ముందుకెళ్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో హైకోర్టు రైతుల పిటిషన్‌ను తోసిపుచ్చింది.

మల్లన్నసాగర్ ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం బలవంతపు భూ సేకరణకు పాల్పడుతోందని ఆరోపిస్తూ బాధిత రైతులు హైకోర్టును ఇదివరకు ఆశ్రయించారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. చివరకు ప్రభుత్వం రైతులు అడిగిన విధంగా పరిహారం ఇవ్వడానికి సమ్మతి తెలపడంతో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News